Ranga Reddy District (Image Source: ChatGPT)
హైదరాబాద్

Ranga Reddy District: ‘ఖాకీ’ సినిమా రేంజ్ ట్విస్టులు.. ఈ కేసు చూస్తే మతి పోవాల్సిందే!

Ranga Reddy District: రంగారెడ్డి జిల్లాలో ఎస్బీఐ ఏటీఎం (SBI ATM) చోరీ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నిందితులు ఎంతో చాకచక్యంగా దాదాపు రూ. 30 లక్షలు దోచుకెళ్లడంతో ఈ వార్త ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు మెుదలుపెట్టారు. ఈ క్రమంలో తాజాగా ఈ కేసును ఛేందించిన పోలీసులు.. ఇందుకు కారకులైన నిందితులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో సంచలన విషయాలను వెల్లడించారు.

నగదు, కారు స్వాధీనం
రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) మహేశ్వరం మండలంలోని రావిర్యాల గ్రామంలో ఎస్బీఐ ఏటీఎం దోపిడికి సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. వారిని రాహుల్ ఖాన్, ముస్తకీం, షకీల్, వహీద్, షారుక్ గా గుర్తించినట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించిన సీపీ.. దర్యాప్తునకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. నిందితులు.. హర్యానా – రాజస్థాన్ సరిహద్దు ప్రాంతానికి చెందిన వారని తెలిపారు. వారి వద్ద నుంచి రూ.4 లక్షల నగదు, షిఫ్ట్ కారును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అలాగే చోరీకి ఉపయోగించిన కట్టర్స్ ను సైతం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మెుత్తంగా నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ.9.5 లక్షలు ఉంటుందని స్పష్టం చేశారు.

మరోమారు చోరికి యత్నం
మార్చి 2న రావిర్యాల ఏటీఎంలో నిందితులు చోరికి పాల్పడినట్లు రాచకొండ సీపీ సుదీర్ బాబు స్పష్టం చేశారు. గ్యాస్ కట్టర్ ను ఉపయోగించి రూ. 29,69,900 దోచుకెళ్లినట్లు పేర్కొన్నారు. చోరీ కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని సాంకేతిక ఆధారాల ద్వారా నేరస్తులను గుర్తించినట్లు తెలిపారు. నిందితులు.. ఏటీఎం చోరీ కోసం రాజస్థాన్ కు చెందిన జాహుల్ ఖాన్ అనే వ్యక్తి కారు వాడారని పేర్కొన్నారు. కారు నెంబర్ ప్లేటు మార్చి చోరికి పాల్పడ్డారని సీపీ వివరించారు. చోరీ తర్వాత అదే కారులో మార్చి 24న మరోసారి ఏటీఎం చోరికి నగరానికి వచ్చారని అన్నారు. ఈ మేరకు హైదరాబాద్ లో రెక్కి నిర్వహించినట్లు పేర్కొన్నారు.

Also Read: Swiggy Instamart: స్విగ్గీ వినూత్న నిర్ణయం.. మెుబైల్ ప్రియులకు ఇక పండగే!

ఈజీ మనీ కోసమే..
నిందితులలో ఒకరైన రాహుల్ ఖాన్.. గతంలో హైదరాబాద్, ఒడిశా లో గ్యాస్ కట్టర్లతో ఏటీఎం చోరీలకు పాల్పడినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఈ క్రమంలో జైలుకు వెళ్లినా నిందితుడిలో మార్పు రాలేదని అన్నారు. ఈజీ మనీ కోసం రాహుల్ ఇలా ఏటీఎం చోరీలకు పాల్పడుతున్నట్లు సీపీ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. నిమిషాల వ్యవధిలో రావిర్యాల ఏటీఎం చోరీని పూర్తి చేసి.. వివిధ మార్గాల్లో తిరుగుతూ పోలీసులను తప్పుదోవ పట్టించినట్లు సీపీ తెలిపారు. చోరీ అనంతరం తిరుగు ప్రయాణంలో మైలర్ దేవ్ పల్లి లో కూడా చోరికి నిందితులు యత్నించినట్లు సీపీ తెలియజేశారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!