Swiggy Instamart (Image Source: ChatGPT)
Uncategorized

Swiggy Instamart: స్విగ్గీ వినూత్న నిర్ణయం.. మెుబైల్ ప్రియులకు ఇక పండగే!

Swiggy Instamart: ప్రస్తుతం కాలంలో మెుబైల్స్ ప్రతీ మనిషి జీవితంలో భాగమైపోయాయి. ఎక్కడికి వెళ్లినా సరే చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. పల్లె, పట్నం, నగరం అన్న తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ మెుబైల్స్ ను ఉపయోగిస్తున్నారు. దీంతో మెుబైల్స్ సేల్స్ దేశంలో నానాటికి పెరిగిపోతోంది. ఇది గమనించిన ప్రముఖ పుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ.. సరికొత్త నిర్ణయం తీసుకుంది. స్విగ్గీ ఇన్ స్టామార్ట్ గ్రోసరి డెలివరీ యాప్ (Swiggy Instamart – Grocery Delivery App) ద్వారా స్మార్ట్ ఫోన్స్ ను వేగంగా కస్టమర్లకు చేర్చాలని నిర్ణయించింది. ఈమేరకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

10 నిమిషాలకే ఫోన్ డెలివరీ
మార్కెట్లో మెుబైల్స్ కు ఉన్న డిమాండ్ ను గమనించిన ప్రముఖ డెలివరీ సంస్థ స్విగ్గీ (Swiggy).. 10 నిమిషాలకే స్మార్ట్ ఫోన్స్ ను చేరవేస్తామంటూ వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆపిల్ (Apple), శాంసంగ్ (Samsung), వన్ ప్లస్ (Oneplus), రెడ్ మీ (Redmi) ఇలా ఏ కంపెనీ మెుబైల్ అయినా తమ స్విగ్గీ ఇన్ స్టామార్ట్ యాప్ (Swiggy Instamart App)లో బుక్ చేసుకుంటే వెంటనే కస్టమర్లకు డెలివరీ చేస్తామని స్పష్టం చేసింది. ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లోనే కస్టమర్ చేతిలో సదరు మెుబైల్ ఉంటుందని స్విగ్గీ వర్గాలు ప్రకటించాయి. లేటేస్ట్ ఐఫోన్ 16e (iPhone 16e) మోడల్ ను సైతం బుక్ చేసుకోవచ్చని సూచించింది.

ఆ నగరాల్లో సేవలు
ప్రస్తుతం హైదరాబాద్ సహా పది నగరాల్లో 10 నిమిషాల్లో స్మార్ట్ ఫోన్స్ డెలివరీ సేవలు ప్రయోగాత్మకంగా ప్రారంభించినట్లు స్విగ్గీ వెల్లడించింది. హైదరాబాద్ తో పాటు చెన్నై, ఫరిదాబాద్, నోయిడా, గుర్ గావ్, కోల్ కత్తా, పుణె, బెంగళూరు, ముంబయి, డిల్లీ నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పింది. రాబోయో రోజుల్లో మరిన్ని నగరాలకు ఈ స్మార్మ్ ఫోన్ డెలివరీ సేవలు విస్తరిస్తామని స్విగ్గీ స్పష్టం చేసింది.

Also Read: Kodali Nani Hospitalized: కొడాలి నానికి గుండెపోటు.. అత్యవసరంగా ఆస్పత్రిలో చేరిక.. ఆందోళనలో వైసీపీ!

డిస్కౌంట్ తో సేల్స్
ప్రారంభంలో కొన్ని మెుబైల్స్ ను మాత్రమే తమ యాప్ లో అందుబాటులోకి ఉంచనున్నట్లు స్విగ్గీ తెలిపింది. ఐఫోన్ 16ఈ (iPhone 16e), శాంసంగ్ గెలాక్సీ ఎం 35 (Samsung Galaxy M35), వన్ ప్లస్ నార్డ్ సీఈ (OnePlus Nord CE), వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ (OnePlus Nord CE 4 Lite), రెడ్ మీ 14సీ (Redmi 14C) మెుబైల్స్ ను కొనుగోలు చేయవచ్చని సూచించింది. రూ.11,499 పైబడిన మెుబైల్ ను కొనుగోలు చేస్తే 5% లేదా రూ.4000 వరకూ డిస్కౌంట్ పొందవచ్చని స్పష్టం చేసింది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు కొనుగోళ్లకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని తెలిపింది.

ఆ డెలివరీ సంస్థలు సైతం..
ప్రముఖ డెలివరీ సంస్థలు బ్లింక్ ఇట్ (Blinkit) జెప్టో (Zepto) సైతం మెుబైల్స్ డెలివరీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. పలు నగరాల్లో స్మార్ట్ ఫోన్లను వేగంగా కస్టమర్లకు అందిస్తున్నాయి. వివో స్మార్ట్ ఫోన్స్ (Vivo Smart Phones), అసుస్ కీబోర్డ్స్ (Asus Keyboards) ను జెప్టో వేగంగా కస్టమర్లకు డెలివరీ చేస్తోంది. బ్లింక్ ఇట్ యాప్.. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 సిరీస్ (Samsung Galaxy S24 series), ప్లే స్టేషన్ 5 (PlayStation 5)తో పాటు బంగారం – వెండి నాణెలను కస్టమర్లకు అందిస్తోంది.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ