Kodali Nani Hospitalized: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత, మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యం కారణంగా ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. గ్యాస్ట్రిక్ సమస్య తలెత్తడంతో ఆయన ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా నానికి అక్కడి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే నానికి గుండె సంబంధిత సమస్యలు తలెత్తినట్లు గుర్తించారని సమాచారం. దీంతో నానికి గుండెపోటు వచ్చిందని ప్రచారం ఊపందుకుంది. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా నాని తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన కొడాలి నాని.. అప్పట్లో చంద్రబాబు (CM Chandrababu) టార్గెట్ గా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లోకేష్ (Nara Lokesh) ను సైతం వదలకుండా విమర్శలు గుప్పించారు. ఓ అడుగు ముందుకేసి వారిద్దరిని తీవ్ర పదజాలంతో దూషించారు కూడా. అదే స్థాయిలో వ్యవహరించిన వల్లభనేని వంశీ (Vallbhaneni Vamsi)ని ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో కొడాలి నానిని సైతం అరెస్టు చేస్తారని ఏపీ (Andhra Pradesh)లో ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో నాని అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరడం ఆసక్తికరంగా మారింది.
Also Read: YCP vs TDP: వారెవ్వా.. ఏపీ పాలిటిక్స్ పీక్స్.. ఆ ఎమ్మెల్యే ఏమన్నారంటే?
మరోవైపు కొడాలి నానికి గుండెపోటు అన్న వార్త ఒక్కసారిగా బయటకు రావడంతో వైసీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన నియోజకవర్గమైన గుడివాడ వైసీపీ క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. అటు వైసీపీ ముఖ్య నేతలు.. కొడాలి నాని పరామర్శించేందుకు ఏఐజీ ఆస్పత్రికి చేరుకుంటున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
Dogs Cry at Night: కుక్కలు రాత్రిపూట ఎందుకు ఏడుస్తాయి.. ఇది శుభమా.. ? అశుభమా?
Case on Bandi Sanjay: బండి సంజయ్ కు ఊహించని ఝలక్.. పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు!