YCP vs TDP: వారెవ్వా.. ఏపీ పాలిటిక్స్ పీక్స్.. ఆ ఎమ్మెల్యే ఏమన్నారంటే?
YCP vs TDP (imagecredit:twitter)
ఆంధ్రప్రదేశ్

YCP vs TDP: వారెవ్వా.. ఏపీ పాలిటిక్స్ పీక్స్.. ఆ ఎమ్మెల్యే ఏమన్నారంటే?

స్వేచ్చ బ్యూరో: YCP vs TDP: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఐదు మండలాల ఎంపిటీసిలు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌తో క‌లిసి ఎంపీటీసీలు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌ను క‌లిసి విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఈనెల 27 వ తన జరగనున్న ఎంపిపి, వైస్ ఎంపిపి ఎన్నికలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని వైసీపీ నేత‌లు కోరారు.

అనంత‌రం ఎమ్మెల్యే చంద్ర‌శేఖ‌ర్ మీడియాతో మాట్లాడుతూ ఒక్క స్థానం బలం కూడా లేకుండా కూటమి గెలవాలని చూస్తోందని ఆరోపించారు. చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నాం.. ఒక్క ఎంపీపీని కూడా గెలవలేరా? ఒక్క ఎంపీటీసీని కూడా గెలవలేరా? అని ప్రశ్నించారు.

నిస్సిగ్గుగా..

ఎర్రగొండపాలెంలోని మూడు మండలాల్లోని ఒక ఎంపీటీసి ఒక వైస్ ఎంపీపీ, ఒక కో ఆప్షన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయి. త్రిపురాంతకం మండలంలో 18కి 18 మంది ఎంపీటీసీలు వైసీపీ వారే. ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్లపాటు ఇద్దరికి ఇచ్చాం. ఒప్పందం ప్రకారం సుబ్బారెడ్డి దిగిపోయారు. ఆయన స్థానంలో ఆళ్ల అంజిరెడ్డికి కేటాయించాం. కుట్రలతో ఆళ్ల అంజిరెడ్డి స్థానాన్ని దక్కించుకోవాలని కూటమి నేతలు చూస్తున్నారు.

ఆళ్ల అంజిరెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. కూటమి నేతల స్క్రిప్టుతో పోలీసులు కేసులు నమోదు చేశారు. నిస్సిగ్గుగా వైసీపీ వారిని భయపెట్టి దక్కించుకోవాలని చూస్తున్నారు
నిజంగా రాజ్యాంగంపై నమ్మకముంటే ఏడాది తర్వాత వచ్చే ఎన్నికల్లో గెలవొచ్చుగా? మీకు ధైర్యం లేదు కాబట్టే అక్రమ మార్గంలో గెలవాలని చూస్తున్నారు. మీకు ప్రజాబలం లేదు కాబట్టే ఈ తరహా తప్పుడు విధానాన్ని ఎంచుకున్నారు’ అని తాటిపర్తి విమర్శించారు.

Also Read: Anantapur News: ఏపీలో అద్భుతం.. ఆ యువకుడి మాటే నిజమైందా?

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..