Wines Lucky Draw: మద్యం షాపుల కిక్కు దక్కేందుకు ఎక్సైజ్ శాఖ ద్వారా మహబూబాబాద్(Mahabubabad), సూర్యాపేట(Suryapet) జిల్లాలో లక్కీ డ్రా(Lucky draw) నిర్వహించారు. ఆధ్యాంతం ఆతృతగా ఎదురుచూసిన కొంతమందికి లక్కు దక్కకపోవడంతో నిరాశకు గురయ్యారు. మరికొందరు తమ లక్కును పరీక్షించుకునేందుకు భారీగానే మద్యం షాపుల కోసం టెండర్లు దాఖలు చేశారు. కొందరికి అదృష్ట లక్ష్మి వరించగా, మరికొందరికి లక్కు చిక్కలేదు.
భార్యాభర్తలు తండ్రి కొడుకులకు దక్కిన కిక్ లక్కు
సూర్యాపేట(Surayapet) జిల్లా వేములపల్లి మండలం లక్ష్మీదేవి గూడెం గ్రామానికి చెందిన ఎలికట్టి భరత్(Elikatti Bharat) కు ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం గెజిట్ నెంబర్ 21 షాపు దక్కింది. అదేవిధంగా ఆయన భార్య శ్రావణి(Sravani)కి గెజిట్ నెంబర్ 13 షాపు దక్కడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. భార్యాభర్తలకు అదృష్టవశాత్తు రెండు షాపులు దక్కాయి. మహబూబాబాద్ జిల్లాలో మరిపెడకు గోట్ల వెంకన్న(Venkanna)కు గెజిట్ నెంబర్ 31వ షాపు దక్కగా, ఆయన కుమారుడు రాకేష్ యాదవ్కు గెజిట్ నెంబర్ 12 షాపు వరించింది. ఇక ఆ రెండు కుటుంబాల్లో సంతోషం వెళ్లి విరిసింది. ఓ కుటుంబంలో భార్య భర్తలకు, మరో కుటుంబంలో తండ్రి కొడుకులకు మద్యం షాపులు వరించడంతో వారిని తమ కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, శ్రేయోభిలాషులు ప్రత్యేకంగా అభినందించారు.
ఆరు జిల్లాల్లో అందిన దరఖాస్తులు
నల్గొండ(Nalgonda), సూర్యాపేట(Surapet), ఖమ్మం(Khammam), కొత్తగూడెం(Kothagudem), ములుగు(Mulugu), మహబూబాబాద్ మొత్తం 443 మద్యం షాపులకు గాను 18401 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఇందుకుగాను మూడు లక్షల రుసుముతో ఎక్సైజ్ శాఖకు 552 కోట్ల 3 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది.
Also Read: OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!
