Kurnool Bus Accident (Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం.. పోలీసుల అదుపులో బైకర్ ఫ్రెండ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు

Kurnool Bus Accident: కర్నూలు జిల్లా బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదానికి ప్రధాన కారణమైన బైకర్ శంకర్ గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి ముందు బైక్ పై శివ శంకర్ తో ప్రయాణించిన మరో యువకుడు ఎర్రిస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారించగా కీలక విషయాలు వెలుగుచూశాయి.

బైకర్ ఫ్రెండ్ ఏమన్నారంటే?

బస్సు ప్రమాదం గురించి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు.. ఎర్రిస్వామిని ప్రశ్నించగా విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. దర్యాప్తు వర్గాల సమాచారం ప్రకారం.. వర్షంలో బైక్ పై వెళ్లిన శంకర్, ఎర్రిస్వామి మద్యం మత్తులో ఉన్నారు. తాము ప్రయాణిస్తున్న బైక్‌ను.. వి కావేరీ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టలేదని ఎర్రిస్వామి తేల్చి చెప్పాడు. ఘటనాస్థలి అయిన చిన్నటేకూరు వద్దకు రాగానే బైక్ స్కిడ్ అయ్యి వారిద్దరు కిందపడిపోయారు. రోడ్డు మధ్యలో బైక్ పడిపోగా.. శంకర్, ఎర్రిస్వామి రోడ్డుకు చెరోవైపు పడిపోయారు.

భయంతో పారిపోయిన ఎర్రిస్వామి

బైక్ పైన నుంచి కిందపడగానే శివ శంకర్ తల డివైడర్ ను బలంగా తాకింది. దీంతో అతడికి తీవ్రగాయాలై స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయాడు. ఎర్రిస్వామి మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వారు బైక్ నుంచి కింద పడిన కొద్దిసేపటికే వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు వేగంగా దూసుకొచ్చింది. రోడ్డుపై అడ్డంగా పడి ఉన్న బైక్ ను చూసుకోకుండా డ్రైవర్ ముందుకు పోనిచ్చాడు. 300 మీటర్ల వరకూ బైక్ ను బస్సు ఈడ్చుకెళ్లడంతో నిప్పురవ్వలు ఎగిసిపడి మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. అయితే బస్సు ప్రమాదం చూడగానే భయంతో ఎర్రిస్వామి అక్కడి నుంచి పారిపోయాడు. సీసీ ఫుటేజ్, సెల్ ఫోన్ నెంబర్ల ఆధారంగా ఎర్రిస్వామిని పోలీసులు పట్టుకున్నారు.

బైకర్ వీడియో వైరల్

కర్నూలు బస్సు ప్రమాదానికి ముందు బైకర్ శివ శంకర్ కు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అర్ధరాత్రి 2.20 గంటల సమయంలో శివ శంకర్, అతడి స్నేహితుడి ఎర్రిస్వామి ఓ పెట్రోల్ బ్యాంక్ కు వచ్చారు. ఈ క్రమంలో శివ శంకర్ ప్రవర్తన మద్యం సేవించిన వారి లెక్క కనిపించింది. తడబడుతున్నట్లు ఉండటం.. బైక్ ను ర్యాష్ గా ముందుకు పోనివ్వడం.. ఈ క్రమంలో బండి కాస్త స్కిడ్ కావడం సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. దీంతో అతడు శివ శంకర్ మద్యం సేవించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Also Read: QR Code Theif: వీడో చిత్ర విచిత్ర దొంగ.. క్యూఆర్ కోడ్ మార్చేసి.. దర్జాగా షాపు నుంచి దోపిడి!

లగేజీ క్యాబిన్‌లో 400 మెుబైల్స్

ప్రమాదానికి గురిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సును ఫోరెన్సిక్ బృందాలు పరిశీలించగా ఒక కొత్త అంశం తెరపైకి వచ్చింది. ప్రమాద ఘటన తీవ్రతకు కారణం.. బస్సు క్యాబిన్ లో 400 పైగా ఫోన్లు అని ఫోరెన్సిక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బస్సుకు ముందు వైపున ఉన్న లగేజీ క్యాబిన్ 400కు పైగా ఉన్న ఫోన్ల పార్సిల్ ఉన్నట్లు దర్యాప్తు వర్గాలు గుర్తించాయి. బైక్ ను బస్సు ఢీకొట్టగానే అది మెుదట క్యాబిన్ కిందకే వచ్చిందని.. బైక్ నుంచి చెలరేగిన మంటలు.. లగేజీ క్యాబిన్ లోని మెుబైల్ బ్యాటరీలను బ్లాస్ట్ అయ్యేలా చేశాయని తెలుస్తోంది. దీనివల్ల మంటలు వేగంగా బస్సుకు వ్యాపించి ప్రాణ నష్టం భారీగా పెరిగినట్లు అంచనా వేస్తున్నారు.

Also Read: Mahabubabad: రాష్ట్రంలో ఘోరం.. మైనర్ బాలికపై అత్యాచారం.. రూ.3 లక్షలకు సెటిల్‌మెంట్!

Just In

01

Minister Konda Surekha: స్వేచ్ఛ ఎఫెక్ట్.. దేవాదాయశాఖపై మంత్రి కొండా సురేఖ సమీక్ష!

Rashmika Mandanna: సౌత్ ఇండియాలో రష్మికా మందాన టాప్ హీరోయిన్ ఎలా అయ్యారో తెలుసా.. రీజన్ ఇదే..

Election Commission: జూబ్లీహిల్స్‌లో సోదాలు ముమ్మరం.. అభ్యర్థుల వెనక షాడో టీమ్‌లు

Intermediate Exams: ఈసారి ఇంటర్ పరీక్షలు యథాతథం.. వచ్చే సంవత్సరం నుంచి మార్పులు

Satish Shah passes away: ప్రముఖ వెటరన్ నటుడు సతీశ్ షా కన్నుమూత..