Jyothi rai: గుప్పెడంత మనసు ( Guppedantha Manasu) సీరియల్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సీరియల్లో నటించించిన బుల్లితెర నటీ నటులు తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్నారు. ముఖ్యంగా రిషి, వసుధార, జగతి పాత్రలకు ప్రేక్షకులు చాలా కనెక్ట్ అయ్యారు. ఇక రిషి, వసుల ప్రేమ కథకి లక్షల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. జగతి, రిషిల మధ్య జరిగిన ఎమోషనల్ సీన్స్ అందర్ని ఏడిపించేశాయి. జగతి ఎవరో కాదు, ఆమె ఒక హీరోయిన్. పాత్ర నచ్చడంతో రిషికి తల్లిగా నటించింది. ఆ తర్వాత ఆమె అలాంటి పాత్రలతోనే వస్తుందేమో అనుకున్నారు కానీ, ఎవరు ఊహించని విధంగా హీరోయిన్ గా రావడంతో అందరూ షాక్ అయ్యారు.
ఇటీవలే జ్యోతిరాయ్ ( Jyothi rai) పై ఎన్నో రూమర్స్ వచ్చాయి. యువ దర్శకుడితో ప్రేమాయణం నడుపుతుందని వీరి రిలేషన్ పై పుకార్లు ( Rumours ) వచ్చాయి. కానీ, చివరికి అవే నిజమయ్యాయి. కట్ చేస్తే అతన్నే రెండో పెళ్ళి చేసుకుని హ్యాపీగా ఉంటుంది. ఈమెకి ఒక బాబు కూడా ఉన్నాడు. కన్నడ డైరెక్టర్ సుక్కు ను వివాహం చేసుకున్న తర్వాత, తన లైఫ్ మారిపోయిందని పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది.
Also Read: Motor Fre Tap Drive: జలమండలి మోటార్ ఫ్రీ టాప్ డ్రైవ్ షురూ.. ఇల్లీగల్ మోటార్లు స్వాధీనం.. ఎక్కడంటే!
సుక్కు పూర్వజ్ ( Poorvaj) కన్నడ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు అతనికి చాలా క్లోజ్. ఈ నేపథ్యంలోనే తన భార్యను మెయిన్ లీడ్ లో పెట్టి పూర్వాజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ కిల్లర్ ను తెరకెక్కిస్తోన్నాడు. ఈ చిత్రం రెండు భాగాలుగా రిలీజ్ కానుందని మూవీ టీం తెలిపింది. ఇదిలా ఉండగా, ఈ మధ్య జ్యోతి రాయ్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటోంది. ఆమె ఫ్యాన్స్ కోసం ఫొటోస్ ను అప్లోడ్ చేస్తూ ఉంటుంది.
ఈ నెల 30న కిల్లర్ ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షుకుల ముందుకు రానుందని జ్యోతి రాయ్ ( Jyothi rai) క్యాప్షన్ పెడుతూ ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జీన్స్ లుక్ లో జ్యోతిని చూసిన కుర్రాళ్ళు రక రకాల కామెంట్స్ చేస్తున్నారు. వామ్మో ఏం అందం అండి బాబు .. మిమ్మల్ని చూస్తే నా మతి పోతోంది. నలభై ఏళ్ళు వచ్చిన ఇంత గ్లామర్ మెయింటైన్ చేస్తున్నారంటే మీరు సూపర్ అంటూ ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ ను క్లిక్ చేయగలరు