Collector BM Santhosh: ఎర్రవల్లిలో సజావుగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి
Collector BM Santhosh (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Collector BM Santhosh: ఎర్రవల్లి మండల కేంద్రంలో సజావుగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి: కలెక్టర్ సంతోష్

Collector BM Santhosh: మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి శాంతియుత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్(BM Santhosh) తెలిపారు. బుధవారం మానవపాడు, ఎర్రవల్లి మండల కేంద్రాల్లోని ప్రభుత్వ పాఠశాలలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను ఎస్పీ శ్రీనివాసరావు(SP Srinivasa Rao)తో కలిసి కలెక్టర్ లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు.

పోస్టల్ బ్యాలెట్ పత్రాలను..

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కౌంటింగ్‌లో పారదర్శకత, ఖచ్చితత్వం అత్యంత ముఖ్యమని అన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ పత్రాలను లెక్కించి, తరువాత వార్డ్ మెంబర్ బ్యాలెట్ పేపర్లను వేరుచేసి క్రమపద్ధతిలో ఓట్లను లెక్కించాలని అధికారులను ఆదేశించారు. అన్ని వార్డుల లెక్కింపులు పూర్తయ్యాక సర్పంచ్ బ్యాలెట్ పత్రాలను కలిపి అభ్యర్థుల వారీగా లెక్కించాలని స్పష్టంగా సూచించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లు, పర్యవేక్షణ వ్యవస్థ, సిబ్బంది సమన్వయం సమర్థవంతంగా సాగుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.

Also Read: The RajaSaab: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడో తెలుసా!.. చీఫ్ గెస్ట్ ఎవరంటే?

అవాంఛనీయ ఘటనలు

ఫలితాలు వెలువడిన తరువాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కౌంటింగ్ అనంతరం పోలింగ్ సామాగ్రిని రిసెప్షన్ కౌంటర్లో అందజేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నర్సింగ రావు, పదవ బెటాలియన్ కమాండెంట్ జయరాజు, అసిస్టెంట్ కమాండెంట్ నరేందర్ రెడ్డి, ఎన్నికల అధికారులు నుషిత, నరేష్, సయీద్ ఖాన్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Also Read: Sarpanches: కొత్త సర్పంచ్‌లకు అలెర్ట్.. బాధ్యత స్వీకరణ తేదీ వాయిదా.. ఎందుకంటే?

Just In

01

Tamil Nadu Crime: తూత్తుకుడిలో దారుణం.. భర్త ముందే భార్యపై అత్యాచారం..!

YouTube Reporter Arrest: యూ ట్యూబ్ ఛానల్‌ను అడ్డం పెట్టుకుని వసూళ్లు చేస్తున్న​ రిపోర్టర్‌ అరెస్ట్..!

Transgender Nandini: పంచాయతీ ఎన్నికలో వార్డు మెంబర్‌గా ట్రాన్స్ జెండర్ గెలుపు..?

Collector BM Santhosh: ఎర్రవల్లి మండల కేంద్రంలో సజావుగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి: కలెక్టర్ సంతోష్

Bigg Boss Telugu 9: తప్పిస్తే గెలుస్తారు.. బిగ్ బాస్ దెబ్బకి షాకైన హౌస్‌మేట్స్!