YouTube Reporter Arrest: యూ ట్యూబ్ ఛానల్‌ను అడ్డం పెట్టుకుని..!
YouTube Reporter Arrest (imagecredit:swetcha)
క్రైమ్, హైదరాబాద్

YouTube Reporter Arrest: యూ ట్యూబ్ ఛానల్‌ను అడ్డం పెట్టుకుని వసూళ్లు చేస్తున్న​ రిపోర్టర్‌ అరెస్ట్..!

YouTube Reporter Arrest: యూ ట్యూబ్ ఛానల్‌ను అడ్డం పెట్టుకుని వసూళ్లకు పాల్పడుతున్న​ రిపోర్టర్‌ను శాలిబండ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శాలిబండ ప్రాంతంలో ఉంటున్న సయ్యద్​ బిలాల్(Syed Bilal) అనే వ్యక్తి ఓ యూ ట్యూబ్​ ఛానల్​(YouTube channel) పెట్టుకుని దాని పేర పైరవీలు.. బ్లాక్​ మెయిల్​ చేస్తూ జనం నుంచి డబ్బు గుంజుతున్నాడు. ఇటీవల ఓ వ్యక్తిపై కేసు నమోదు కాగా అరెస్ట్ కాకుండా పోలీసులతో మాట్లాడుతానని చెప్పి 35వేల రూపాయలు అడిగాడు. అడిగినంత ఇవ్వకపోతే అరెస్ట్​ చేయిస్తానని బెదిరించాడు. దాంతో బాధితుడు ఫిర్యాదు చేయగా కేసులు నమోదు చేసిన పోలీసులు సయ్యద్​ బిలాల్​ ను బుధవారం అరెస్ట్ చేశారు.

Also Read: Ustaad BhagatSingh : ‘దేఖలేంగే సాలా..’ సాంగ్ చూసి వీవీ వినాయక్ హరీష్‌కు చెప్పింది ఇదే.. ఇది వేరే లెవెల్..

ఖబడ్ధార్​..

పాతబస్తీలో పలువురు ఇలాగే యూ ట్యూబ్ ఛానళ్ల పేర సెటిల్​ మెంట్లు.. బెదిరింపులకు పాల్పడుతూ డబ్బు వసూలు చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని సౌత్ జోన్​ డీసీపీ కిరణ్​ ఖరే(DCP Kiran Khare) చెప్పారు. ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని స్పష్టం చేశారు. బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదులు చేయాలని సూచించారు. ఆ వెంటనే కేసులు నమోదు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలా యూ ట్యూబ్ ఛానళ్ల పేర వసూళ్ల దందా చేస్తున్న వారి గురించి తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. వారి వివరాలను గోప్యంగా పెడతామన్నారు.

Also Read: IDPL Land Issue: రవీందర్ రావు బాగోతాన్ని మొత్తం బయటపెడతా: శ్రీకాంత్ గౌడ్

Just In

01

MLA Krishnamohan Reddy: కేవలం అభివృద్ధి కోసమే సీఎంను కలిసాను: ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

Murder Case: తన మామను హత్య చేశాడని పగబట్టి.. ప్రతీకారం తీర్చుకున్న అల్లుడు

Tamil Nadu Crime: తూత్తుకుడిలో దారుణం.. భర్త ముందే భార్యపై అత్యాచారం..!

YouTube Reporter Arrest: యూ ట్యూబ్ ఛానల్‌ను అడ్డం పెట్టుకుని వసూళ్లు చేస్తున్న​ రిపోర్టర్‌ అరెస్ట్..!

Transgender Nandini: పంచాయతీ ఎన్నికలో వార్డు మెంబర్‌గా ట్రాన్స్ జెండర్ గెలుపు..?