VC Sajjanar: వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులన అనాధలుగా వదిలేసే వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని హైదరాబాద్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్ (VC Sajjanar) హెచ్చరించారు. జన్మనిచ్చిన వారి బాగోగులు చూడటం బిడ్డల బాధ్యత అని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఓ పోస్టును పెట్టారు. విధి నిర్వహణలో భాగంగా ఎంతోమంది పిల్లలు వృద్ధాప్యానికి చేరుకున్న తల్లిదండ్రులను అనాధలుగా వదిలేయటం, ఓల్డ్ ఏజ్ హోంలలో చేర్పించటం చూసినట్టు పేర్కొన్నారు.
Also Read: VC Sajjanar: రాష్ట్రంలో సంచలన కేసుల విచారణ కోసం స్పెషల్ టీం ఏర్పాటు: వీసీ సజ్జనార్
భవిష్యత్తులో మీ పిల్లలు కూడా మీ పట్ల అలాగే వ్యవహరిస్తారు
ఇది బాధాకరమని వ్యాఖ్యానించారు. తల్లిదండ్రుల బాగోగులు చూడటం పిల్లల ధర్మమని చెప్పారు. దీంట్లో ఎలాంటి సాకులు. సమర్థనలకు ఆస్కారం లేదన్నారు. ఈ రోజు మీరు మీ తల్లిదండ్రుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో భవిష్యత్తులో మీ పిల్లలు కూడా మీ పట్ల అలాగే వ్యవహరిస్తారన్న విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. వృద్ధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినా, హింసించినా, రోడ్డుపై వదిలేసినా ఉపేక్షించేది లేదన్నారు. కడుపునిండా బిడ్డల్ని కని అవసాన దశలో ఒంటరిగా మిగిలిపోతున్న వారికి పోలీసు శాఖ అండగా ఉంటుందని చెప్పారు. వారి ఆత్మగౌరవం, భద్రత, శ్రేయస్సుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. బాధితులు నిర్భయంగా తనను నేరుగా సంప్రదించ వచ్చన్నారు.
Also Read: VC Sajjanar: మోసానికి గురైతే ఫిర్యాదు చేయమంటారు.. కంప్లైంట్ చేస్తే పట్టించుకోని వైనం!

