Transgender Nandini: వార్డు మెంబర్‌గా ట్రాన్స్ జెండర్ గెలుపు..?
Transgender Nandini (imagecredit:swetcha)
Telangana News, మహబూబ్ నగర్

Transgender Nandini: పంచాయతీ ఎన్నికలో వార్డు మెంబర్‌గా ట్రాన్స్ జెండర్ గెలుపు..?

Transgender Nandini: నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ ట్రాన్స్ జెండర్ ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారు. జిల్లాలోని చారకొండ(Vharakonda) మండలం కేంద్రంలో 11వ వార్డు మెంబర్‌గా కాంగ్రెస్(Congress) పార్టీ మద్దతుతో నందిని(Nandini) (ట్రాన్స్ జెండర్) పోటీ చేశారు. బుధవారం జరిగిన మూడో విడత ఎన్నికల్లో నందిని 64 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం విశేషం.

కాంగ్రెస్ పార్టీ నాకు మద్దతు

ఈ సందర్భంగా నందిని మాట్లాడుతూ.. ప్రజల అభిమానంతో వార్డు మెంబర్(Ward Member) అయ్యానన్నారు. కాంగ్రెస్ పార్టీ నాకు మద్దతు ఇవ్వడం సంతోషకరమని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ట్రాన్స్ జెండర్లకు ఎంతో సాయం చేస్తున్నారని అన్నారు. రాజకీయాల్లో కూడా ట్రాన్స్ జెండర్లకు మంచి పేరు తీసుకొచ్చేలా కృషి చేస్తానన్నారు.

పదవి ప్రమాణ స్వీకారం

స్థానిక సమరంలో ఇటీవల గ్రామ పంచాయతీల సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ మూడు విడతలలో చేపట్టారు. జిల్లాలో ఈనెల 11, 14 ,17 తేదీలలో మండలాల వారిగా ఎన్నికల ప్రక్రియను చేపట్టారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు పదవి ప్రమాణ స్వీకారం ఎంతో ప్రధానమైనది. గెలుపొందిన వారు పదవీ ప్రమాణం చేస్తేనే సాంకేతికంగా అధికారాన్ని పొందుతారని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం పేర్కొంటుంది. మూడు విడుతలుగా నిర్వహించిన ఎన్నికల్లో అదే రోజున ఓట్ల లెక్కింపు అనంతరం గెలిచిన రోజునే సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు ఎప్పటికప్పుడే వారు ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారులు ధ్రువీకరణ పత్రాలను అభ్యర్థులకు అందజేశారు.

Also Read: Chamala Kiran Kumar Reddy: బొమ్మాయి పల్లి రైల్వే స్టేషన్‌లో ప్రధాన రైళ్లకు హాల్ట్ ఇవ్వాలని కేంద్ర మంత్రికి ఎంపీ చామల వినతి

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?