Chamala Kiran Kumar Reddy: కేంద్ర మంత్రికి ఎంపీ చామల వినతి
Chamala Kiran Kumar Reddy (imagecrdit:swetcha)
Political News, Telangana News

Chamala Kiran Kumar Reddy: బొమ్మాయి పల్లి రైల్వే స్టేషన్‌లో ప్రధాన రైళ్లకు హాల్ట్ ఇవ్వాలని కేంద్ర మంత్రికి ఎంపీ చామల వినతి

Chamala Kiran Kumar Reddy: బొమ్మాయి పల్లి రైల్వే స్టేషన్‌లో ప్రధాన రైళ్లకు హాల్ట్ ఇవ్వాలని రైల్వే మంత్రిత్వ శాఖను కోరిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumarreddy) భువనగిరి సమీపంలోని బొమ్మైపల్లి రైల్వే స్టేషన్‌(Bommaipalli Railway Station)లో ప్రధాన రైళ్లకు హాల్ట్ కల్పించాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్(Minister Ashwini Vaishnaw)ని కోరారు భువనగిరి ఎంపీ చామల. ప్రజల దీర్ఘకాలిక డిమాండ్‌ను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. భువనగిరి సమీపంలోని రెండవ రైల్వే స్టేషన్‌గా ఉన్న బొమ్మైపల్లి, సికింద్రాబాద్ నుంచి నడికుడి మీదుగా గుంటూరు వెళ్లే రైళ్లకు ముఖ్యమైన జంక్షన్ అయినప్పటికీ, ప్రస్తుతం అక్కడ ఏ ప్రధాన రైలుకూ హాల్ట్ లేకపోవడం ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారిందని ఎంపీ తెలిపారు.

బొమ్మైపల్లి స్టేషన్‌లో..

బొమ్మైపల్లి రైల్వే స్టేషన్‌కు సమీపంలోనే రోజుకు సుమారు లక్ష మంది భక్తులు దర్శించుకునే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయమైన స్వర్ణగిరి ఉన్నదని, అలాగే ఏఐఐఎంఎస్బీబీనగర్ కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపారు. అదేవిధంగా తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం కూడా సమీపంలోనే ఉన్నదని గుర్తుచేశారు. బొమ్మైపల్లి స్టేషన్‌లో ప్రధాన రైళ్లకు హాల్ట్ కల్పిస్తే ప్రయాణికులు, భక్తులు, రోజువారీ ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎంపీ పేర్కొన్నారు. దీని ద్వారా ఆధ్యాత్మిక పర్యాటకం, చేనేతవస్త్ర వ్యాపారం, వ్యవసాయ మార్కెటింగ్, స్థానిక వ్యాపారాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Also Read: Urea Shortage: యూరియా కొరత సమస్య తీరుతుందా? సర్కారు తీసుకొస్తున్న యాప్‌తో సక్సెస్ అవుతుందా?

రైల్వే స్టేషన్‌ను ఆధునీకరణ

అదేవిధంగా బొమ్మైపల్లి రైల్వే స్టేషన్‌ను ఆధునీకరణ చేసి అభివృద్ధి చేయాలని, వేచి ఉండే హాళ్లు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు, రిటైల్ స్టాళ్లు, వాహనాల పార్కింగ్ వంటి ప్రయాణికుల సౌకర్యాలు కల్పించాలని రైల్వే శాఖను కోరారు. దీని ద్వారా రైల్వే శాఖకు అదనపు ఆదాయం కూడా సమకూరుతుందని తెలిపారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భువనగిరి స్టేషన్‌కు అదనంగా బొమ్మైపల్లి రైల్వే స్టేషన్‌లో కూడా ప్రధాన రైళ్లకు హాల్ట్ కల్పించే దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రైల్వే మంత్రిని విజ్ఞప్తి చేశారు.

Also Read: IDPL Land Issue: రవీందర్ రావు బాగోతాన్ని మొత్తం బయటపెడతా: శ్రీకాంత్ గౌడ్

Just In

01

YouTube Reporter Arrest: యూ ట్యూబ్ ఛానల్‌ను అడ్డం పెట్టుకుని వసూళ్లు చేస్తున్న​ రిపోర్టర్‌ అరెస్ట్..!

Transgender Nandini: పంచాయతీ ఎన్నికలో వార్డు మెంబర్‌గా ట్రాన్స్ జెండర్ గెలుపు..?

Collector BM Santhosh: ఎర్రవల్లి మండల కేంద్రంలో సజావుగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి: కలెక్టర్ సంతోష్

Bigg Boss Telugu 9: తప్పిస్తే గెలుస్తారు.. బిగ్ బాస్ దెబ్బకి షాకైన హౌస్‌మేట్స్!

Chamala Kiran Kumar Reddy: బొమ్మాయి పల్లి రైల్వే స్టేషన్‌లో ప్రధాన రైళ్లకు హాల్ట్ ఇవ్వాలని కేంద్ర మంత్రికి ఎంపీ చామల వినతి