IDPL Land Issue: రవీందర్ రావు బాగోతాన్ని మనుకోట సాక్షిగా బయటపెడతామని తెలంగాణ జాగృతి అధికార ప్రతినిధి శ్రీకాంత్ గౌడ్(Srikanth Goud) అన్నారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి ఆఫీస్‌లో బీసీ జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తరి మారయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ రావు మీడియాతో కలిసి మాట్లాడారు. ఐడీపీఎల్(IDPL) లో కబ్జా అయిన భూములకు సంబంధించి ప్రభుత్వం విచారణకు ఆదేశించటాన్ని స్వాగతిస్తున్నామన్నారు. గ్రామాల్లో ఎన్నికలు ఉంటే అక్కడ ప్రభావం పడకూడదనే మేము బస్తీ బాట పెట్టుకున్నామన్నారు. మేడ్చల్ జిల్లాలో జనంబాట లో ఎమ్మెల్యేల అక్రమాలు, అవినీతి బాగోతాలను వినతి రూపంలో కవిత కి ప్రజలు ఇచ్చారని.. మీడియా ముఖంగా ప్రశ్నించారన్నారు.
విచారణలో అనిల్ రావు
ఆయా ప్రాంతాల్లో హాస్పిటల్స్, మౌలిక సదుపాయాలు లేవని ప్రశ్నిస్తే కూకట్ పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు(MLA Krishna Rao) వ్యక్తిగతంగా ఆరోపణలు చేశారన్నారు. దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని.. కృష్ణారావు అక్రమాల చిట్టాను కంకణ బద్దులై బయటపెట్టారన్నారు. ఐతే కాంగ్రెస్(Congress) ప్రభుత్వం చాలా సందర్భాల్లో ముందుకు విచారణకు ఆదేశించి తర్వాత వెనక్కి తగ్గుతోంది. కాంగ్రెస్‌తో అంటకాగుతున్న బీఆర్ఎస్(BRS) నాయకులపై విచారణ చేయకుండా వెనక్కి తగ్గుతోంది. ఐడీపీఎల్ భూములకు సంబంధించి ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ అని పారదర్శంగా విచారణ జరిపించి దోషులను తేల్చాలని డిమాండ్ చేశారు. ఇదే విచారణలో అనిల్ రావు(Anil Rao) పై చేసిన ఆరోపణలకు సంబంధించి కూడా నిజాలు బయటకు వస్తాయని, ఒక్క ప్రభుత్వ భూములే కాదు. ప్రైవేట్ భూములను కూడా ఎమ్మెల్యేలు కబ్జా పెట్టారు. వాటిలో చాలా వరకు హైడ్రా పరిధిలోకి వచ్చే భూములు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి డేటా అంత మా దగ్గర ఉంది. దాన్ని మేము ప్రభుత్వానికి ఇస్తాం. ప్రభుత్వం చర్యలు చేపట్టి ప్రైవేట్ వ్యక్తుల భూములను కూడా కాపాడాలని కోరారు.
70 ఎకరాల విల్లా ప్రాజెక్ట్
చెరువు శిఖం భూములకు సంబంధించి కృష్ణారావు కొడుకు రేరా కు వివరాలు ఇచ్చారు. ఇప్పుడు అడ్డంగా దొరికిన తర్వాత కృష్ణారావు బీరాలు పోతున్నారు. కానీ మీ అక్రమాల పుట్ట పగిలిపోయింది. విజిలెన్స్ విచారణలో అన్ని తేలుతాయి. ప్రజల కోసమే కవిత ఈ అక్రమాలను బయట పెడుతున్నారు. 70 ఎకరాల విల్లా ప్రాజెక్ట్ లో చెరువు భూమిని కబ్జా పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. కచ్చితంగా గతంలో గానీ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేల భూ బాగోతాల భరతం పడతాం అన్నారు. ఎమ్మెల్యేల బాగోతాలు బయటపెడుతుంటే కవిత మీద ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఎమ్మెల్సీ రవీందర్ రావు(MLC Ravindhar Rao) కూడా ఒక టీవీ ఛానెల్ లో విపరీతంగా మాట్లాడారు. ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాం అన్నారు. కవిత మీద అవాకులు, చెవాకులు పేలే వారికి తగిన విధంగా బుద్ది చెప్తాం అని హెచ్చరించారు.
Also Read: Dr Gopi: రైతుల కష్టాలకు చెల్లు.. ఇది ఒక్కటీ ఉంటే చాలు, ఇంటికే యూరియా!

