Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 101వ రోజు (Bigg Boss Telugu Season 9 Day 101) హౌస్‌మేట్స్‌లోని కొందరి ఏవీలతో పాటు, కొన్ని ‘వన్స్‌మోర్.. వన్ లాస్ట్ టైమ్’ అంటూ కొన్ని టాస్క్‌లు ఆడించారు. అందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా టీమ్ విడుదల చేసింది. ఈ ప్రోమోలో కంటెస్టెంట్లకు బిగ్ బాస్ ఒక ఆసక్తికరమైన, సవాలుతో కూడిన టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ పేరు ‘తప్పిస్తే గెలుస్తారు’. హౌస్‌లోని కంటెస్టెంట్లు తమకు ఇచ్చిన బుట్టల నుండి బంతులను తీసి ఇతరుల మీద వేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎక్కువ బంతుల నుండి తప్పించుకుంటారో, వారే ఈ టాస్క్‌లో విజేతలుగా నిలుస్తారు. ఈ టాస్క్ సమయంలో కంటెస్టెంట్ల మధ్య గట్టి పోటీ కనిపించింది. ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ, ఆటలో గెలవడానికి శతవిధాలా ప్రయత్నించారు. ముఖ్యంగా కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది.
Also Read- Venu Udugula: పద్మశ్రీ పొందిన ముఖం, ఖాళీ గోడలా కనిపిస్తోందా?.. వేణు ఊడుగుల పోస్ట్ వైరల్!
సంజనపై డిమోన్ సీరియస్
మరీ ముఖ్యంగా సంజన (Sanjjanaa) సేఫ్ గేమ్ ఆడుతుంది. కళ్యాణ్, తనూజ, ఇమ్ము.. ఈ ముగ్గురూ డిమోన్ పవన్‌నే టార్గెట్ చేస్తూ ఆడుతున్నారు. ‘నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?’ అని పవన్ (Demon Pawan) అడిగితే, ‘నువ్వు అందరినీ టార్గెట్ చేస్తున్నావు కాబట్టి మేము నిన్ను చేస్తున్నాం’ అని సమాధానం చెబుతున్నారు. దీంతో సంజనపై డిమోన్ ఫైర్ అయ్యాడు. వాళ్లు ముగ్గురు నన్ను టార్గెట్ చేస్తుంటే మీరెందుకు అలా చూస్తూ ఉన్నారని అనగానే.. నేను కూడా టార్గెట్ చేస్తున్నా అంటూ సమాధానమిచ్చింది. ఆ సమాధానానికి డిమోన్ సీరియస్ అయ్యాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వివాదం నడిచినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే ఆఖరి ‘వన్స్‌మోర్’ టాస్క్ అని చెప్పడంతో హౌస్‌మేట్స్ అందరూ షాక్ అయ్యారు. అందరూ మంచిగా ఆడాలని చెప్పాడు. ఈ వారం మొత్తం డిమోన్ అద్భుతంగా ఆడాడు. అందుకే మిగతా వారంతా అతన్నే టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తుంది.
Also Read- Sreeleela: స్నానం చేస్తున్నట్లుగా ఏఐ పిక్స్ వైరల్.. శ్రీలీల సంచలన పోస్ట్!
ఎమోషనల్ మూమెంట్స్
కేవలం ఆట మాత్రమే కాదు, ఈ ప్రోమోలో ఎమోషనల్ అంశాలు కూడా హైలైట్‌గా నిలిచాయి. బిగ్ బాస్ ఒక ప్రత్యేకమైన వీడియో సందేశాన్ని హౌస్‌మేట్స్‌లోని సంజనకు చూపించారు. ఇందులో సంజన చెల్లెలు నిక్కీ గల్రానీ మాట్లాడుతుంది. ‘నువ్వు అనుకున్నట్టు ఇది నీకు సెకండ్ లైఫ్ లాంటిది, ఫినాలే కోసం ఆల్ ది బెస్ట్’ అని చెబుతూ ‘నాకు అక్క, నీకు అమ్మ అయిన సంజనతో గొడవ పడవద్దు’ అని ఇమ్మానుయేల్‌ని కోరింది. దీంతో సంజన ఎమోషనల్ అవుతోంది. మిగతా ఇంటి సభ్యులు కూడా ఆమె మాటలకు ఎమోషనల్ అవుతున్నారు. వీడియో సందేశం అనంతరం తన మదర్ సంజనని ఇమ్ము దగ్గరకు తీసుకుని తన ప్రేమని కనబరుస్తున్నాడు. ఈ ఎమోషనల్ సపోర్ట్ కంటెస్టెంట్లకు ఫినాలే దిశగా మరింత ఉత్సాహాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. ఇక టాస్క్‌లు పూర్తయ్యాయి కాబట్టి.. గురువారం కేవలం హౌస్‌మేట్స్ ఏవీలే టెలికాస్ట్ చేసే అవకాశం ఉంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

