Shambhala: ‘శంబాల’.. రిలీజ్‌‌కు ముందే లాభాల్లో!
Shambhala (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Shambhala: టాప్ డిస్ట్రిబ్యూషన్ సంస్థల చేతుల్లోకి ‘శంబాల’.. రిలీజ్‌‌కు ముందే లాభాల్లో!

Shambhala: వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ (Aadi Sai Kumar) నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రం ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’ (Shambhala: A Mystical World). షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించారు. యుగంధర్ ముని (Ugandhar Muni) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు ఇతర కీలక పాత్రల్ని పోషించారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీగా బజ్‌ని, క్రేజ్‌ని, డిమాండ్‌ని ఏర్పరచగా.. ఫ్యాన్సీ రేటుకు అన్ని ఏరియాలలో బిజినెస్ పూర్తవడం విశేషం. ఈ విషయాన్ని స్వయంగా మేకర్స్ తెలియజేస్తున్నారు. అంతేకాదు, ఈ సినిమాలో ఉన్న కంటెంట్‌ని చూసి, పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు రావడంతో చిత్రయూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది.

Also Read- Venu Udugula: పద్మశ్రీ పొందిన ముఖం, ఖాళీ గోడలా కనిపిస్తోందా?.. వేణు ఊడుగుల పోస్ట్ వైరల్!

భారీ డిస్ట్రిబ్యూషన్ సంస్థల చేతుల్లోకి..

ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌లో అంచనాల్ని పెంచేసింది. ఇక సోషల్ మీడియాలో అయితే ‘శంబాల’ మేకింగ్ వీడియో, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా ట్రెండై, సినిమాను వార్తల్లో ఉంచాయి. డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైన ఈ చిత్రంపై విడుదలకు ముందే బ్లాక్ బస్టర్ అనేలా ట్రేడ్ సర్కిల్స్‌‌లో టాక్ వినిపిస్తుండటం చూస్తుంటే.. ఈ సినిమాలో ఉన్న కంటెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ సినిమా అన్ని ఏరియాల్లో భారీ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

Also Read- Sreeleela: స్నానం చేస్తున్నట్లుగా ఏఐ పిక్స్ వైరల్.. శ్రీలీల సంచలన పోస్ట్!

విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్స్‌లో..

నైజాం ఏరియాలో మైత్రి (Mythri Distributors) డిస్ట్రిబ్యూట్ చేస్తుండగా.. ఏపీ, సీడెడ్ ఏరియాలో ఉషా పిక్చర్స్ (Usha Pictures) ఈ మూవీని భారీ ఎత్తున డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఇక ఓవర్సీస్‌లో సైతం ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నట్లుగా తెలుస్తోంది. ఓవర్సీస్‌లో ఈ సినిమాను మూన్ షైన్ సినిమాస్, కర్ణాటకలో కుమార్ బెంగళూర్ ఫిల్మ్స్ సంస్థలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి. డిజిటల్, శాటిలైట్ రైట్స్ కూడా ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైనట్లుగా సమాచారం. ‘శంబాల’ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఓటీటీ సంస్థలో ఆహా పోటీ పడి తీసుకోగా, శాటిలైట్ రైట్స్ జీ నెట్‌వర్క్ కైవసం చేసుకుంది. మొత్తంగా చూస్తే.. సినిమా విడుదలకు ముందే నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్స్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. హీరో ఆది సాయి కుమార్‌కు కూడా హిట్ పడి చాలా కాలం అవుతుంది. ఈ సినిమా రైట్స్ అమ్ముడైన తీరు చూస్తుంటే.. ఈసారి పక్కాగా ఆయన బ్లాక్ బస్టర్ కొడుతున్నారనేది అర్థమవుతోంది. భారీ బడ్జెట్‌తో నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా నిర్మించగా, దర్శకుడు ఈ మూవీని విజువల్ వండర్‌‌గా, సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా అద్భుతమైన దృశ్య కావ్యంగా తెరకెక్కించినట్లుగా టాక్ నడుస్తోంది. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

YouTube Reporter Arrest: యూ ట్యూబ్ ఛానల్‌ను అడ్డం పెట్టుకుని వసూళ్లు చేస్తున్న​ రిపోర్టర్‌ అరెస్ట్..!

Transgender Nandini: పంచాయతీ ఎన్నికలో వార్డు మెంబర్‌గా ట్రాన్స్ జెండర్ గెలుపు..?

Collector BM Santhosh: ఎర్రవల్లి మండల కేంద్రంలో సజావుగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి: కలెక్టర్ సంతోష్

Bigg Boss Telugu 9: తప్పిస్తే గెలుస్తారు.. బిగ్ బాస్ దెబ్బకి షాకైన హౌస్‌మేట్స్!

Chamala Kiran Kumar Reddy: బొమ్మాయి పల్లి రైల్వే స్టేషన్‌లో ప్రధాన రైళ్లకు హాల్ట్ ఇవ్వాలని కేంద్ర మంత్రికి ఎంపీ చామల వినతి