Transgenders: ట్రాన్స్‌జెండర్స్ వస్తున్నారంటే ముందు వాళ్ళ నుంచి చప్పట్లు వినబడతాయి. భారతదేశంలో వాళ్ళు చప్పట్లు కొట్టడం అనేది ఒక సాంప్రదాయక ఆచారం. అయితే, ఇదొక ఆచారమని మనలో చాలా మందికి తెలీదు. దీని వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
గుర్తింపు, దృష్టి ఆకర్షణ: చప్పట్లు కొట్టడం ద్వారా ట్రాన్స్‌జెండర్స్ తమ ఉనికిని సమాజంలో స్పష్టంగా తెలియజేస్తారు. ఈ ప్రత్యేకమైన చప్పట్ల శబ్దం (సాధారణంగా రెండు చేతులను వేగంగా, లయబద్ధంగా కొట్టడం) వారిని ఇతరుల నుండి వేరు చేస్తుంది. ఇదొక రకమైన సామాజిక సంకేతం, వారి ఉనికిని ప్రకటించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
Also Read: Medak Heavy Rains: ఆ జిల్లాల్లో దంచికొట్టిన వర్షం.. జలదిగ్బంధంలో ఏడుపాయల దుర్గమ్మ ఆలయం
సాంప్రదాయం, సాంస్కృతిక ఆచారం: హిజ్రా సమాజంలో ప్రతి యొక్కరు చప్పట్లు కొడుతుంటారు. ఇది చాలాకాలంగా వారి సంస్కృతిలో భాగంగా ఉంది. ఇక వీళ్ళు ఏదైనా శుభకార్యం జరుగుతుంటే చాలు అక్కడికి వచ్చేసి అందరికీ వినిపించేలా చప్పట్లు గట్టిగా కొడుతుంటారు. వివాహాలు జరిగేటప్పుడు ఆశీర్వాదాలు ఇవ్వడానికి వెళ్లినప్పుడు.. ఈ చప్పట్లు వారి ఆశీర్వాదానికి లేదా ఆకర్షణకు సంకేతంగా ఉంటాయి.
ఆర్థిక కారణాలు: ట్రాన్స్‌జెండర్స్ సమాజంలో చాలామంది సాంప్రదాయకంగా ఆశీర్వాదాలు ఇవ్వడం లేదా నృత్యం చేయడం ద్వారా జీవనోపాధి పొందుతారు. చప్పట్లు కొట్టడం ద్వారా వారందర్ని ఆకర్షించి, డబ్బు లేదా బహుమతులు అడిగే అవకాశాన్ని సృష్టించుకుంటారు. ఇలా వారు ఎంతో కొంత డబ్బును పొందుతారు.
Also Read: Varalaxmi Sarathkumar: తన సోదరి పూజా శరత్ కుమార్‌తో వరలక్ష్మి చేస్తున్న చిత్రానికి టైటిల్ ఫిక్స్!
సామాజిక ఒత్తిడి, వ్యతిరేకత: కొన్ని సందర్భాల్లో, చప్పట్లు కొట్టడం సమాజంలో కొందరికీ నచ్చదు. ఇలాంటి సమయంలో వారి పై సామాజిక వ్యతిరేకత కనబడుతుంది. ట్రాన్స్‌జెండర్లు సమాజంలో తరచూ వివక్ష, హింస, అవమానాలను ఎదుర్కొంటారు. చప్పట్లు కొట్టడం ద్వారా వారు తమ గుర్తింపును గట్టిగా ప్రకటించి, తమ ఉనికిని ధైర్యంగా చాటుకుంటారు.