Gurram Paapi Reddy: నరేష్ అగస్త్య (Naresh Agastya), ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’ (Gurram Paapi Reddy). ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో నిర్మాతలు వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు ప్రేక్షకులు తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతున్న సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇందులో ఓ కీలక పాత్ర చేసిన హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరై, చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఈ సినిమాలో కామెడీ విలన్ పాత్ర చేసిన జీవన్ కుమార్ (Jeevan Kumar).. సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read- Boyapati Sreenu: సెప్టెంబర్ 25కే మొదటి కాపీ రెడీ.. ‘ఓజీ’ కోసం బాలయ్యే ఆపమన్నారు
మంచి భోజనం పెడతా..
జీవన్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘సినిమా పేరు ‘గుర్రం పాపిరెడ్డి’. చాలా బాగా వచ్చింది. ఇందులో నేను కాటి కాపరి పాత్రను ప్లే చేశాను. ఒక చెడ్డీ, పట్టపట్టనట్టుగా ఉన్న బట్టలు, నుదుటన నల్ల బొట్టు.. ఇలాంటి వేషదారణతో నాతో నటింపజేశారు. అయితే అంత ఈజీగా అయితే ఏం కాలేదు. ఎండలో గుండుపై నుంచి నీళ్లు కారుతుండేవి. బొట్టు ఉండేది కాదు. అలా మేకప్‌కి కాస్త కష్టంగానే ఉండేది. ఆ టైమ్‌లో హీరోయిన్ ఫరియాతో పాటు అందరూ ఎంతగానో సపోర్ట్ చేశారు. అందుకే సినిమా చాలా బాగా వచ్చిందని అంతా అనుకుంటున్నాం. సెన్సార్ కూడా అయిపోయింది. యుబైఏ సర్టిఫికెట్ వచ్చింది. అందరూ పిల్లలతో ఈ సినిమాకు రావచ్చు. డైరెక్టర్ ఈ సినిమా కోసం రెండు రోజులుగా కష్టపడుతూనే ఉన్నారు. నిద్రాహారాలు లేవు. సెన్సార్‌కు పంపించాలని చాలా కష్టపడుతున్నారు. నేనే ఫోన్ చేసి తిన్నారా? అని అడిగేవాడిని. అందరూ ఈ సినిమాకు సపోర్ట్ చేస్తే.. డిసెంబర్ 19న అందరం హ్యాపీగా ఉంటాం. సినిమా కనుక మంచి సక్సెస్ చేస్తే.. అందరికీ భోజనాల ఏర్పాట్లు చేస్తా. నాది భీమవరం.. తెలుసుగా. మంచి భోజనం పెడతా. డిసెంబర్ 19న సోలోగా వస్తున్నాం. ‘అవతార్’ ఒక్కటే ఉంది. అది మనకి పోటీ కానే కాదు. 19న ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాలో నా పాత్రకు అంతగా డైలాగ్స్ లేవు’’ అని చెప్పుకొచ్చారు.
Also Read- Sivaji: నేను మంచోడినా? చెడ్డోడినా? అనేది ప్రేక్షకులే చెప్పాలి
బొట్టు పెట్టిన హీరోయిన్
ఇదే వేదికపై జీవన్ కుమార్ మాట్లాడుతున్నప్పుడు సినిమాలోని పాత్రలా ముఖానికి బొట్టు పెట్టించుకోవాలని యాంకర్ అడిగారు. మీ దగ్గర నల్ల బొట్టు ఉంటే తీసుకురండి పెట్టుకుంటాను అని అనగానే యాంకర్ మంజూష నల్ల బొట్టు తెచ్చి ఇచ్చింది. ఇంతలో పక్కనే ఉన్న హీరోయిన్ ఫరియా వచ్చి జీవన్‌కు బొట్టు పెట్టింది. ఆమె బొట్టు పెట్టడంపై జీవన్ చమత్కరించారు. నా జన్మ ధన్యమైందని అనగానే అంతా హాయిగా నవ్వుకున్నారు. ఇలా సరదాసరదాగా ఈ వేడుక సాగింది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

