Bigg Boss Telugu 9: టాప్ 5తో ఆ తిక్క తిక్క గేమ్స్ ఏంటి బిగ్ బాస్?
Bigg Boss Telugu 9 (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Bigg Boss Telugu 9: టాప్ 5తో ఆ తిక్క తిక్క గేమ్స్ ఏంటి బిగ్ బాస్? నవ్వుతున్నారు తెలుసా!

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 100వ రోజు (Bigg Boss Telugu Season 9 Day 100) కూడా బిగ్ బాస్ తిక్క తిక్క గేమ్స్ పెట్టి నస పెట్టిస్తున్నాడు. చూసే వారికి కాదండోయ్.. లోపల ఆడేవారికి. అవును, ఈ మాట అంటుంది ఎవరో తెలుసా? ఆడియెన్సే. అరే.. టాప్ 5 హౌస్‌మేట్స్‌తో ఏం చేయాలో తోచక, ఇంకా వారం పాటు సాగదీయడానికి అన్నట్లుగా ‘వన్స్ మోర్.. వన్ లాస్ట్ టైమ్’లో ఇప్పటి వరకు బిగ్ బాస్‌లో జరిగిన గేమ్స్‌ని, టాస్క్‌లను రిపీట్ చేస్తున్నారు. టాప్ 5లో ఉన్నామనే సంతోషాన్ని అనుభవించనీయకుండా హౌస్‌మేట్స్‌ని చిత్రహింసలు పెడుతున్నారు. చక్కగా ఏ కామెడీ టాస్క్‌లో, ఫజిల్సో ఇవ్వకుండా ఫిజికల్ టాస్క్‌లు ఇస్తూ.. టాప్ 5కి, అలాగే వారిని అభిమానించే వారికి చిరాకు తెప్పిస్తున్నాడు బిగ్ బాస్. మరి ఈ నస ఎప్పటికి ఆగుతుందో.. చివరి వారం అయినా వారిని వదలిపెట్టకుండా.. ఈ చిత్ర విచిత్ర టాస్క్‌లేంటో.. అని అంతా నవ్వుకుంటున్నారు. భరణి (Bharani) ఎలిమినేట్ అయ్యే ముందు.. హౌస్‌లోని సీన్స్‌ని రీ క్రియేట్ చేయమనే టాస్క్ ఎంత చక్కగా పేలింది. అలాంటివి ఏమైనా ప్లాన్ చేయవచ్చు కదా. ఎందుకిలా ఇబ్బంది పెడుతున్నారనేలా.. బిగ్ బాస్ టీమ్ వదులుతున్న ప్రోమోలకు ఆడియెన్స్ కామెంట్స్ చేస్తుండటం విశేషం. ఇక తాజాగా వచ్చిన ప్రోమోలను గమనిస్తే..

Also Read- Sivaji: నేను మంచోడినా? చెడ్డోడినా? అనేది ప్రేక్షకులే చెప్పాలి

పిక్ ద బోన్

‘బ్యాటిల్ టైమ్’ అంటూ వచ్చిన ప్రోమోలో.. ‘వన్స్‌మోర్, వన్ లాస్ట్ టైమ్’లో పోటీదారులకు ఇస్తున్న టాస్క్ పిక్ ద బోన్. ఈ టాస్క్ వివిధ రౌండ్స్‌లో జరుగుతుంది. తాళ్లతో ఏర్పాటు చేసిన ఉచ్చులు, మీ దారిలో అడ్డంగా ఉన్న టైర్లను, ఉడెన్ ప్లాంట్స్‌ని దాటుకుని బోన్‌ని తీసుకోవాలి.. అని బిగ్ బాస్ చెబుతున్నారు. ఈ గేమ్‌లో డిమోన్ పవన్ తన సత్తా ఏంటో మరోసారి చాటాడు. అందరికంటే ఫాస్ట్‌గా బోన్‌ని పిక్ చేశాడు. కళ్యాణ్ కూడా బోన్‌ని ఒక్కసారి పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. పవన్ మాత్రం 3 టైమ్స్ తీసుకున్నట్లుగా ఈ ప్రోమో తెలియజేస్తుంది. అయితే ఈ టాస్క్ అంత ఈజీగా అయితే లేదు. కళ్యాణ్ (Kalyan), పవన్ (Demon Pawan) ఇద్దరికీ దెబ్బలు కూడా తగినట్లుగా తెలుస్తోంది.

Also Read- Pawan Kalyan: ‘ఓజీ’ దర్శకుడికి పవన్ కళ్యాణ్ ఊహించని సర్‌ప్రైజ్.. ఇది వేరే లెవల్!

ధమాకా కిక్

‘హౌస్ వైబ్స్’ అంటూ వచ్చిన మరో ప్రోమోలో.. ‘పోటీదార్లకు ఇస్తున్న మరో టాస్క్.. ధమాకా కిక్. పవన్ ఈ టాస్క్ గుర్తుందా?’ అని బిగ్ బాస్ అడుగుతుంటే.. ఫ్లాష్‌బ్యాక్ చూపిస్తున్నారు. ఈ రోజు బాగా ఆడి చూపిస్తాను బిగ్ బాస్ అని పవన్ మాటిస్తున్నాడు. సంజన, తనూజ, ఇమ్మానుయేల్ ఇద్దరూ ఈ టాస్క్‌లో ఫెయిల్ అయ్యారు. చెప్పినట్లుగానే పవన్ కొట్టి చూపించాడు. కళ్యాణ్ కూడా దానిని రీచ్ చేయలేకపోయాడు. మొత్తంగా అయితే ఈ టాస్క్ కాస్త ఫన్ గానే నడిచింది. అనంతరం బిగ్ బాస్ మాట్లాడుతూ.. ‘ఇంటి సభ్యులందరూ ఎవరు ప్లేయర్ ఆఫ్ ది డే గా భావిస్తున్నారో చెప్పండి’ అని అనగానే అందరూ తనూజ (Tanuja) పేరు చెప్పారు. తనూజకు ఫ్యామిలీ నుంచి వచ్చిన ఓ ఫొటోని బిగ్ బాస్ పంపించారు. ఆ ఫొటో చూసి తనూజ ఎమోషనల్ అవుతోంది. అంతేకాదు, తన తండ్రికి సారీ కూడా చెబుతోంది.. అలా ఈ ప్రోమో కాస్త ఫన్‌తో మొదలై ఎమోషనల్‌గా ముగిసింది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

MLA Malla Reddy: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. దెబ్బకు సైలెంట్ అయిన సభ్యులు

iBomma Ravi: ఐ బొమ్మ రవికి షాక్​.. మరోసారి కస్టడీకి అనుమతించిన కోర్టు

Pawan Kalyan: గ్రామానికి రోడ్డు కోరిన గిరిజన యువకుడు.. సభ ముగిసేలోగా నిధులు.. డిప్యూటీ సీఎం పవన్‌పై సర్వత్రా ప్రశంసలు

Panchayat Elections: మూడో దశ పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం.. ఉత్కంఠగా మారిన దేవరకొండ రెవెన్యూ డివిజన్ ఓట్లు

Gurram Paapi Reddy: సినిమాను హిట్ చేయండి.. మంచి భోజనం పెడతా! ఈ మాటంది ఎవరంటే?