MLA Malla Reddy: వార్డుల పునర్విభజన అంశంపై అభ్యంతరాలు తెలియజేయాలని మంగళవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే సి.మల్లారెడ్డి(MLA Malla Reddy) మట్లాడాలని మేయర్ ఆదేశించగానే ఆయన ఎంతో భావోద్వేగం స్పందించారు. మల్లారెడ్డి మాట్లాడుతున్నపుడు ఇతర సభ్యులు జోక్యం చేసుకోగా, అమ్మా.. వారు డిఫరెంట్ నేను డిఫరెంట్ జర నేను చెప్పిది వినాలమ్మా.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 61 గ్రామ పంచాయతీలు, 222 మంది సర్పంచ్ లు, అయిదుగురు ఎంపీపీ(MPP)లు, మరో అయిదుగురు జడ్పీటీసీ(ZPTC)లు, మొత్తం 6.80 లక్షల మంది ఓటర్లతో ఉన్న నా నియోజకవర్గాన్ని ముక్కలు చేశారని వాపోయారు. దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్ గిరి(Malkajgiri)కి నేను మాజీ ఎంపీని వ్యాఖ్యానించారు.
మా చెత్త కుప్ప జవహర్ నగర్..
ఎకరం రూ. 177 కోట్ల ధర పలికిన మణికొండ(Manikonda) సమీపంలోని భూములు, భవనాలకు విధించే ట్యాక్స్(Tax) మా చెత్త కుప్ప జవహర్ నగర్(Jawahar Nagar) కు విధించనున్నారని వ్యాఖ్యానించారు. సిటీలోని 150 వార్డుల్లోని చెత్తను సేకరించి, జవహర్ నగర్ లో డంప్ చేస్తున్నారని, ఆ చెత్తతో ఎవరికెలాంటి ముప్పు రావద్దన్న సంకల్పంతో బీఆర్ఎస్(BRS) సర్కారు హయాంలో రూ. 300 కోట్లను వెచ్చించి క్యాపింగ్ చేశామని వివరిస్తూనే, మీరు ఒక్కసారి జవహర్ నగర్ డంపింగ్ యార్డును విజిట్ చేసి, డంపింగ్ యార్డు అభివృద్దికి స్పెషల్ ఫండ్స్ మంజూరు చేయాలని మల్లారెడ్డి కోరారు. ఔటర్ రింగ్ రోడ్డు(ORR) బయటున్న మా ప్రాంతాన్ని జీహెచ్ఎంసీ(GHMC)లో ఎలా విలీనం చేస్తారని ప్రశ్నించారు.
Also Read: KTR: పంచాయతీ నిధులు, ఇందిరమ్మ ఇండ్లు మీ అబ్బ సొత్తు కాదు: కేటీఆర్

