Alluri District: ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చింతపల్లి మండలం మేడూరు గ్రామంలో భార్య భర్తల మధ్య తలెత్తిన వివాదం దారుణ హత్యకు దారి తీసింది. సెల్ ఫోన్ సంభాషణ, అధిక ఫోన్ వాడకం తగ్గించాలని భర్త రాజారావు భార్యను మందలించాడు. దీంతో కోపోద్రిక్తురాలైన ఆమె.. భర్త రాజారావుపై దారుణంగా గొడ్డలితో దాడి చేసింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ రాజారావును విశాఖపట్నం కేజీహెచ్ కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ భర్త ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళ్తే..
ఫోన్ సంభాషణలు కుటుంబాల్లో ఏ విధంగా చిచ్చుపెడుతుంతో చెప్పేందుకు ఈ ఘటన ఓ ఉదాహరణగా నిలుస్తోంది. భార్య తరుచూ ఫోన్ లో మాట్లాడుతుండటంతో భర్త కోర రాజారావుకు అనుమానం ఏర్పడింది. దీంతో అపరిచిత వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడవద్దని రాజారావు గట్టిగా మందలించినట్లు తెలుస్తోంది. ఇంకోసారి అలా చేయడం చూస్తే ఊరుకోనని గతంలోనే హెచ్చరించినట్లు సమాచారం. ఈ విషయమై గత కొద్ది రోజులుగా భార్య, భర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
భర్త శరీరంపై తీవ్ర గాయాలు
ఈ క్రమంలోనే తాజాగా మరోమారు భార్య భర్తల మధ్య ఫోన్ వాడకం గురించి గొడవ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా సహనం కోల్పోయిన భార్య.. దగ్గరలోని గొడ్డలి తీసుకొని రాజారావుపై దాడికి పాల్పడింది. తల, మెడ ఇతర శరీర భాగాలపై గొడ్డలితో వేటు వేసినట్లు సమాచారం. రాజారావు కేకలు విన్న స్థానికులు.. హుటాహుటీనా పరిగెత్తుకు వచ్చారు. భార్యను వెనక్కి తీసి రక్తపు మడుగులో పడి ఉన్న భర్త రాజారావును వెంటనే విశాఖ కేజీహెచ్ కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ రాజారావు ప్రాణాలు విడిచాడు.
Also Read: CM Revanth Reddy: టీ హబ్‌లో గూగుల్ స్టార్టప్ ప్రారంభం.. సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
రంగంలోకి దిగిన పోలీసులు..
మరోవైపు భర్తను చంపిన భార్యను అల్లూరి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫోన్ లో ఆమె ఎవరితో మాట్లాడుతోందన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హత్య వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా అని కూడా విచారణ జరుపుతున్నారు. సాధారణంగా సిటీల్లో ఫోన్ వాడకం అధికంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అలాంటిది మారుమూల గ్రామంలో ఫోన్ వాడకంపై వివాదం చెలరేగడం, అది కూడా ఓ హత్యకు దారి తీయడంతో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.
ఫోన్ మాట్లాడొద్దు అని చెప్పినందుకు భర్తని గొడ్డలితో నరికి హత్య చేసిన భార్య
అల్లూరి జిల్లా చింతపల్లి మండలం మేడూరు గ్రామంలో దారుణం pic.twitter.com/8Yb7zAJjRR
— BIG TV Breaking News (@bigtvtelugu) December 10, 2025

