Boyapati Sreenu: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను (Boyapati Sreenu) కాంబినేషన్‌లో ‘అఖండ’కు సీక్వెల్‌గా వచ్చిన చిత్రం ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2: Thaandavam). ఈ సినిమా రిలీజ్ ఒక వారం వాయిదా పడిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా సెప్టెంబర్ 25నే విడుదల కావాలి. కానీ, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్యే ఈ సినిమాను వాయిదా వేయించారని చెప్పుకొచ్చారు దర్శకుడు బోయపాటి శ్రీను. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైన ఈ చిత్రం థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ బోయపాటి శ్రీను మీడియాకు చిత్ర విశేషాలను తెలుపుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాకు సంబంధించి అనేక విషయాలను ఆయన ఈ సమావేశంలో షేర్ చేసుకున్నారు.
Also Read- Bigg Boss Telugu 9: టాప్ 5తో ఆ తిక్క తిక్క గేమ్స్ ఏంటి బిగ్ బాస్? నవ్వుతున్నారు తెలుసా!
అవెంజర్స్‌కి స్కోప్ ఉన్న సినిమా..
ఆయన మాట్లాడుతూ.. ‘‘అఖండ చూసి ప్రేక్షకుల, అభిమానుల అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమా తర్వాత వచ్చే సినిమా ఇంకా గొప్ప స్థాయిలో ఉండాలి అనుకున్నాం. అలాగే మన ధర్మాన్ని చెప్పడం కూడా ఒక గొప్ప విషయమని భావించాం. ప్రకృతి, పసిబిడ్డ, పరమాత్మ తర్వాత దేశం, ధర్మం, దైవమే నాకు కనిపించింది. అలాంటి కథతో వస్తేనే అభిమానుల అంచనాలను అందుకోగలమని భావించే దేశభక్తి, దైవభక్తి అంశాలను టచ్ చేయడం జరిగింది. ఇది అవెంజర్స్‌కి స్కోప్ ఉన్నటువంటి సినిమా. నిజానికి అవెంజర్స్, సూపర్ మాన్, బ్యాట్ మాన్.. ఇవన్నీ కూడా పుట్టించినవే. కానీ మనకున్న పాత్రలన్నీ కూడా సత్యాలు. కురుక్షేత్రంలో అన్ని ఆయుధాలను వాడినట్లుగా రేడియేషన్ కనిపిస్తుంటుంది. మనకు అంత ఘనమైన చరిత్ర ఉంది కాబట్టి.. ఇలాంటి సినిమాలు ఎన్నైనా చేయవచ్చు. కాకపోతే దీనికి ఉండాల్సిందల్లా సంకల్పం, ఓపిక.
Also Read- Champion: ‘ఛాంపియన్’ కోసం ‘చిరుత’.. శ్రీకాంత్ తనయుడికి కలిసొచ్చేనా?
తమ్ముడికి దారి ఇచ్చేద్దాం
కర్ణాటక, చెన్నై, హిందీలో కూడా ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది. ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. మారుమూల గ్రామాల్లోకి కూడా ఈ సినిమా వెళ్లింది. ఆడుతోంది. రెవిన్యూ పరంగా కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాం. ఈ సినిమా భారతదేశానికి ఆత్మ లాంటిది. అందరికీ చేరాలనే ఉద్దేశంతో చేసిన, తీసిన సినిమా. దీనిని 135 రోజుల్లో తీశాను. కొబ్బరికాయ కొట్టిన రోజే డేట్ అనౌన్స్ చేస్తామని బాలయ్య బాబుకు ముందే చెప్పాను. సెప్టెంబర్ 25 సినిమా రిలీజ్ అని చెప్పాం. మేము అనుకున్నట్టే ఫస్ట్ కాపీ రెడీ ఆ డేట్‌కి అయిపోయింది. కాకపోతే అదే సమయానికి పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ (Pawan Kalyan OG) వస్తుంది. ఇండస్ట్రీలో రెండు పెద్ద సినిమాలు ఒకేసారి రావడం కరెక్ట్ కాదు. రెండు సినిమాలు బాగుండొచ్చు. కానీ థియేటర్లు షేర్ చేసుకోవాలి. మన రెవిన్యూని మనమే ఇబ్బంది పెట్టుకున్నట్టుగా ఉంటుంది. అప్పుడే బాలయ్య బాబు కూడా తమ్ముడికి దారి ఇచ్చేద్దాం, మనం తర్వాత వద్దామన్నారు. అలా మేము పక్కకు వచ్చాము’’ అని తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

