HCA Corruption: హెచ్సీఏ అధ్యక్షునిగా పని చేసినన్నాళ్లూ అడ్డూ అదుపు లేకుండా అక్రమాలకు (HCA Corruption) పాల్పడ్డ జగన్మోహన్ రావు (Jaganmohan Rao) పక్కా ప్లాన్ ప్రకారమే ఆ పదవిని దక్కించుకున్నాడు. అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లోని కొందరు నాయకుల అండతోనే హెచ్సీఏ (HCA) అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. జగన్మోహన్ రావు (Jaganmohan Rao) తోపాటు హెచ్సీఏ కార్యవర్గంలోని మరికొందరు సభ్యులు కూడా అడ్డదారుల్లోనే పదవులు సంపాదించుకున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సీఐడీ (CID) విచారణ జరిపితే నిజాలు నిగ్గు తేలుతాయని పలువురు అంటున్నారు. 2003, అక్టోబర్ లో హెచ్సీఏ 9(HCA)కార్యవర్గానికి జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రావు అధ్యక్ష స్థానానికి పోటీ చేశాడు. దీని కోసం శ్రీచక్ర క్లబ్ కార్యవర్గంలో తాను ఉన్నట్టుగా ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించాడు. మాజీ మంత్రి కృష్ణాయాదవ్ సంతకాన్ని సైతం ఫోర్జరీ చేశాడు.
Also Read: Techie Shot Dead: అమెరికాలో ఘోరం.. తెలంగాణ యువకుడ్ని.. కాల్చి చంపిన పోలీసులు
ఎన్నిక కావటం వెనక చక్రం తిప్పింది బీఆర్ఎస్ నాయకులే
వీటి ఆధారంగా ఎన్నికల్లో పోటీ చేసి ఒకే ఒక్క ఓటు ఆధిక్యంతో గెలిచాడు. జగన్మోహన్ రావు అధ్యక్షునిగా ఎన్నిక కావటం వెనక చక్రం తిప్పింది బీఆర్ఎస్ నాయకులే అన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ లీడర్ల ఒత్తిడితోనే ఎన్నికల అధికారిగా పని చేసిన వీ.సంపత్ కుమార్ పోటీకి జగన్మోహన్ రావు అర్హుడు కాదని తెలిసినా మిన్నకుండి పోయారన్న ప్రచారం ఉంది. దీనిపై హెచ్సీఏతో సంబంధం ఉన్న కొందరితో మాట్లాడగా సీఐడీ అధికారులు సంపత్ కుమార్ ను లోతుగా విచారిస్తే అన్ని నిజాలు వెలుగు చూస్తాయన్నారు. జగన్మోహన్ రావు కోసం ఓటర్ల లిస్టును కూడా మార్చారని తెలిపారు.
ప్రతీ దాంట్లో అవినీతి
హెచ్సీఏ అధ్యక్ష పదవిని చేజిక్కించుకున్న తరువాత జగన్మోహన్ రావు, ఆయన సహచరులు ప్రతీ దాంట్లో అవినీతికి పాల్పడ్డారన్నారు. క్రికెట్ అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సిన కోట్లాది రూపాయలను దిగమింగారని చెప్పారు. హెచ్సీఏ జనరల్ బాడీ మొత్తాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రస్థాయిలో కొత్త జనరల్ బాడీని ఎంపిక చేయాలని కోరారు. లేనిపక్షంలో హెచ్సీఏ కార్యకలాపాలను హైదరాబాద్ వరకే పరిమితం చేయాలని సూచించారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కు బీసీసీఐలో సభ్యత్వం కల్పించాలన్నారు. అప్పుడే రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధి అవుతుందని, ప్రతిభ ఉన్న క్రీడాకారులు వెలుగులోకి వస్తారని చెప్పారు.
Also Read: Telangana Police Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 12,452 పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
హైకోర్టుకు హరీష్ రావు
తనపై బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు చక్రధర్ గౌడ్ గతంలో తనకు హరీష్ రావు నుంచి ప్రాణహాని ఉన్నట్టుగా బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు హరీష్ రావుతోపాటు మరో ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. కాగా, రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తనపై ఈ ఫిర్యాదు చేశారని, కేసులను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని తాజాగా హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు ఆదేశాలు జారీ చేసి తదుపరి విచారణను వాయిదా వేసింది.
Also Read: Dussehra Holidays 2025: విద్యార్థులకు బిగ్ అలెర్ట్.. దసరా సెలవుల్లో మార్పులు.. లోకేశ్ కీలక ప్రకటన
5గురు ఐపీఎస్ ల బదిలీలు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ
5గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మల్ జిల్లా భైంసా ఏఎస్పీగా ఉన్న అవినాష్ కుమార్ ను భైంసా ఎస్డీపీవోగా నియమించారు. వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి సురుకొంటికి వేములవాడ ఎస్డీపీవోగా పోస్టింగ్ ఇచ్చారు. ఏటూరు నాగారం ఎఎస్పీగా ఉన్న శివమ్ ఉపాధ్యాయను ఏటూరు నాగారం ఎస్డీపీవోగా నియమించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏఎస్పీ కాజల్ కు అక్కడే ఎస్డీపీవోగా పోస్టింగ్ ఇచ్చారు. బోనగిరి ఏఎస్పీగా ఉన్న కంకణాల రాహుల్ రెడ్డిని అదనపు ఎస్పీ స్థాయిలో బోనగిరి ఏసీపీగా నియమించారు.
Also Read: Sunitha Laxma Reddy: రాష్ట్రంలో కులాలకు అతీతంగా ఆడుకునే పండుగ బతుకమ్మ!