Sunitha Laxma Reddy: పేద, గొప్ప, కులాలకు అతీతంగా అడుకునే పండుగ బతుకమ్మ అని ఎమ్మెల్యేలు సునీతాలక్ష్మారెడ్డి(MLA Sunitha Laxma Reddy), సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) పేర్కొన్నారు. బతుకమ్మ, బోనాలు కూడా తెలంగాణ ఉద్యమ రూపం తీసుకున్నాయన్నారు. కాంగ్రెస్(Congress) ప్రభుత్వ వైఫల్యాల పై రూపొందించిన బతుకమ్మ పాటల ను తెలంగాణ భవన్ లో గురువారం బీఆర్ఎస్(BRS) మహిళా నేతలు విడుదల చేశారు. బీఆర్ఎస్ మహిళా నేతలు బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆఫీసుల్లో బతుకమ్మ ఆడుకునే అవకాశం కేసీఆర్(KCR) ఇచ్చారన్నారు. బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు చీరలు ఇచ్చిన ఘనత కేసీఆర్ ది అని పేర్కొన్నారు.
తెలంగాణ తల్లి, చేతిలో
కేసీఆర్ ప్రతి పథకం వెనుక ఆడబిడ్డల క్షేమం ఆలోచించేవారని, ఆ పథకాలన్నీ రేవంత్ రెడ్డి(Revanth Reedy) నిలిపివేస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణ తల్లి చేతిలోకి మళ్లీ బతుకమ్మ రావాలని ఆకాంక్షించారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్(Sathyavathi Rathod) మాట్లాడుతూ కోటి మంది మహిళలను గౌరవించిన నాయకుడు కేసీఆర్ అన్నారు. మార్పు అంటే.. తెలంగాణ తల్లి, చేతిలో బతుకమ్మ(Bathukamma) పోతుందనుకోలేదని, బిడ్డ కడుపులో పడ్డప్పటి నుంచి వృద్ధురాలి వరకు కేసీఆర్ పథకాలు అమలు చేశారన్నారు. తండ్రిలా ఆడబిడ్డల గురించి కేసీఆర్ ఆలోచించారని, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లకు కేసీఆర్ భారీగా జీతాలు పెంచారని, అన్నివర్గాల ఆడబిడ్డలను గౌరవించిన కేసీఆర్ మళ్లీ రావాలని ఆకాంక్షించారు.
Also Read: Urea Distribution: రైతన్నలకు గుడ్ న్యూస్.. రెవెన్యూ గ్రామాల వారీగా యూరియా పంపిణి
బతుకమ్మ పండుగ కోసం
మాజీ ఎంపీ మలోతు కవిత(Kavitha) మాట్లాడుతూ లంబాడీలు తీజ్ పండుగ ఘనంగా జరుపుకుంటారని, ఇప్పుడు లంబాడీలు కూడా బతుకమ్మ ఘనంగా జరుపుకుంటున్నారన్నారు. బతుకమ్మ పండుగ కోసం లంబాడీ ఆడబిడ్డలు ఎదురుచూస్తుంటారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖర్ రెడ్డి(Chandrasekhar Reddy), ఎమ్మెల్యే కోవాలక్ష్మి(MLA Kova Laxmi), ఎమ్మెల్సీ దేశపతి, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి,హేమలతా శేఖర్ గౌడ్, వసంత, సుమిత్ర,రజనీ సాయిచంద్, దేవీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Junior OTT: ‘జూనియర్’ ఓటీటీలోకి వస్తోంది.. శ్రీలీల ఫ్యాన్స్‌కు ‘పండగే’!