Urea Distribution: మండలంలో రేపటి నుండి యూరియా పంపిణీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల యందు రెవెన్యూ గ్రామాల వారిగా ఇవ్వడం జరుగుతుందని తహసీల్దార్ ప్రకాష్ రావు, మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మండలం లోని రెవెన్యూ గ్రామాల ప్రకారం మాత్రమే రైతులు సంబంధిత సొసైటీ దగ్గరకు వెళ్లి యూరియా తీసుకెళ్లాలని సూచించారు.
Also Read: Most Expensive Cruise: ప్రపంచంలోనే లగ్జరీ క్రూయిజ్.. ఒక్కో టికెట్ రూ.7 కోట్లు.. ఎందుకంత స్పెషల్?
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చివ్వెంల నందు ఈ క్రింది రెవెన్యూ గ్రామాలు
1.చివ్వెంల
2.బిబి గూడెం
3.దురాజ్ పల్లి
4.కుడ కుడ
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చందుపట్ల నందు ఈ క్రింది రెవెన్యూ గ్రామాలు
1.చందుపట్ల
2.తిమ్మాపురం
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వట్టి ఖమ్మం పహాడ్ నందు ఈ క్రింది రెవెన్యూ గ్రామాలు
1.వట్టి ఖమ్మం పహాడ్
2 గాయం వారి గూడెం
3.ఐలాపురం
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తిరుమలగిరి నందు ఈ క్రింది రెవెన్యూ గ్రామాలు
1.తిరుమలగిరి
2.గుంపుల
3.గుంజలూరు
4 వల్లభాపురం
5.తుల్జారావుపేట
6.ఉండ్రుగొండ
పైన తెలిపిన రెవెన్యూ గ్రామాల రైతులు సంబంధిత సొసైటీ బ్రాంచ్ నందు మాత్రమే యూరియా తీసుకోవాలని. రైతులు తప్పనిసరిగా పట్టాదారు పాస్ పుస్తకం మరియు ఆధార్ కార్డు తీసుకుని స్వయంగా రావాలని తెలియజేశారు. సంబంధిత సొసైటీ బ్రాంచ్ నందు యూరియా వచ్చే సమాచారం వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా తెలియపరుస్తామని, రైతులు సహకరించాలని కోరారు.