Dussehra Holidays 2025: ఏపీలో దసరా సెలవులను పొడగించాలన్న డిమాండ్లు పెద్ద ఎత్తున్న వస్తున్న నేపథ్యంలో.. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుభవార్త చెప్పారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఇచ్చిన సెలవులకు అదనంగా మరో రెండ్రోజులు జోడిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ముందుగా నిర్ణయించిన సెలవులకు అదనంగా ఇంకో రెండ్రోజులు సెలవులు లభించనున్నాయి. ఈ నిర్ణయంతో విద్యార్థులతో పాటు టీచర్లు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
లోకేష్ ట్వీట్..
దసరా సెలవులు పొడగించిన విషయాన్ని మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా తెలియజేశారు. ‘పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 22 నుండి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు నా దృష్టికి తీసుకొచ్చారు. వారి కోరిక మేరకు విద్యా శాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 22 నుండి అక్టోబర్ 2 వరకూ దసరా పండుగ సెలవులు ఇవ్వాలని నిర్ణయించాం’ అని లోకేష్ రాసుకొచ్చారు.
పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 22 నుండి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు నా దృష్టికి తీసుకొచ్చారు. వారి కోరిక మేరకు విద్యా శాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 22 నుండి అక్టోబర్ 2 వరకూ దసరా పండుగ సెలవులు ఇవ్వాలని నిర్ణయించాం. pic.twitter.com/SpUJldmwiH
— Lokesh Nara (@naralokesh) September 19, 2025
Also Read: Techie Shot Dead: అమెరికాలో ఘోరం.. తెలంగాణ యువకుడ్ని.. కాల్చి చంపిన పోలీసులు
టీచర్లు, తల్లిదండ్రుల ఒత్తిడితో…
వాస్తవానికి అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది దసరా సెలవులు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకూ నిర్ణయించారు. అయితే దసరా నవరాత్రులు ఈ నెల 22 నుంచే ప్రారంభం కానున్న నేపథ్యంలో.. సెలవులను రెండ్రోజుల ముందే ఇవ్వాలనే డిమాండ్లు అటు టీచర్లతో పాటు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వచ్చాయి. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం సైతం ఈనెల 21 నుంచే దసరా సెలవులు ఇచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరిగింది. అటు గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీలు సైతం సెలవులు పొడగించాలని కోరడంతో మంత్రి లోకేశ్ సానుకూలంగా స్పందిచినట్లు తెలుస్తోంది.