Nikhil Kavya Breakup: బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ మలియక్కల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గోరింటాకు సీరియల్ తో మనకు పరిచయమైన నిఖిల్, కావ్య శ్రీ జంటకు లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్నారు. వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్న తర్వాత ఇంకా ఫేమస్ అయ్యారు. అయితే, ఆన్ స్క్రీన్ ఈ జంట ప్రేమ సన్నివేశాల్లో బాగా నటించారు. రీల్ లైఫ్ లోనే కాకుండా.. రియల్ లైఫ్‌లో కూడా వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఐదేళ్ల పాటు కలిసి ఉన్న ఈ జంటకు ఎవరి దిష్టి తగిలిందో కానీ, కానీ చిన్న చిన్న గొడవలు కారణంగా బ్రేకప్ చెప్పుకున్నారు. అయితే, ఈ విషయాన్ని ఇద్దరూ మర్చిపోయారు. కానీ, ఫ్యాన్స్ మాత్రం మళ్లీ కలిస్తే చూడాలని ఆశ పడుతున్నారు. అయితే, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బ్రేకప్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.
నిఖిల్, కావ్య ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా కూడా.. ఈ లవ్ బ్రేకప్ గురించే ప్రశ్నలు అడుగుతున్నారు. వీళ్లిద్దరూ మళ్లీ కలవాలంటూ ఫ్యాన్స్ బాగా కోరుకుంటున్నారు. ఇలాంటి సమయంలో నిఖిల్ కిస్సిక్ టాక్స్ షోకి గెస్టుగా వెళ్ళాడు. జబర్దస్త్ వర్ష యాంకర్ గా చేస్తున్న ఈ షోలో మానస్ నాగులపల్లి, భానుశ్రీ, ప్రియాంక జైన్, బిగ్‌బాస్ సెలబ్రిటీలు వచ్చారు. తాజాగా, నిఖిల్ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోను యూట్యూబ్ లో రిలీజ్ చేశారు.
Also Read: Suniel Narang: సినిమాలే చూడను.. వారి ముందు నేను ఎంత?.. కుబేర నిర్మాత సంచలన కామెంట్స్
మీ జీవితంలో బాగా రిగ్రెట్ ఫీలైన విషయం ఏంటని వర్ష అడగగా.. బ్రేకప్ అంటూ ఎమోషనల్ అవుతూ చెప్పాడు. నిఖిల్ మాట్లాడుతూ ఎవర్ని అంత ఈజీగా నమ్మకూడదని తెలిసింది.. నాలాంటి ఒక అబ్బాయి పది మందిలో ఒక అమ్మాయి నచ్చితే మాట్లాడొచ్చు కానీ మా అమ్మా నాన్నలు పది మందిలో ఒక అబ్బాయి నచ్చితే నువ్వే నా కొడుకు రా అని చెప్పలేరు కదా అంటూ చెప్పాడు. అందుకే అబ్బాయికి బ్రేకప్ అయినప్పుడూ కూడా చావు వరకూ వెళ్లకూడదంటూ యువతకు మంచి మెసేజ్ కూడా ఇచ్చాడు నిఖిల్.