Rahul Gandhi: వెరీ గుడ్ రేవంత్ టీమ్ వర్క్ సూపర్ గో హెడ్
Rahul Gandhi ( image credit: swetcha reporter)
జాతీయం

Rahul Gandhi: వెరీ గుడ్ రేవంత్ టీమ్ వర్క్ సూపర్ గో హెడ్.. రాహుల్ గాంధీ కాంప్లిమెంట్!

Rahul Gandhi: సీఎం రేవంత్ అండ్ టీమ్ కు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కాంప్లిమెంట్ ఇచ్చారు.“వెరీ గుడ్ రేవంత్  టీమ్ వర్క్ సూపర్. గో హెడ్”అంటూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై రాహుల్ కామెంట్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఢిల్లీలో రాహుల్ గాంధీ ని సీఎం రేవంత్ రెడ్ది, పీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ముఖ్య టీమ్ మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపొందిన నవీన్ యాదవ్ ను సీఎం .. రాహుల్ గాంధీకి పరిచయం చేశారు. అనంతరం ఎన్నికల పరిస్థితులు, విజయం పై సీఎం రాహుల్ కు వివరించారు.

Also ReadRahul Gandhi: రాహుల్ గాంధీ ఎక్కడ?.. బీహార్ ఫలితాలపై ఇంకా స్పందించని వైనం

కార్యకర్తలు అప్రమత్తంగా పనిచేయాలి 

భవిష్యత్ లోనూ ఇదే జోష్​ తో ముందుకు సాగాలని రాహుల్ సూచించినట్లు తెలిసింది. అనంతరం ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేను కూడా ఈ టీమ్ ప్రత్యేకంగా కలిసింది. తెలంగాణ కాంగ్రెస్ వేవ్ కంటిన్యూ అవుతుందని, లీడర్లు, కార్యకర్తలు అప్రమత్తంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నదని, పదేళ్ల పాటు ప్రభుత్వం ఉండాల్సిందేనని ఖర్గే ఆదేశించిననట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రోహిన్ రెడ్డి లు ఉన్నారు.

Also Read: Modi on Rahul Gandhi: రాహుల్ గాంధీ‌పై ప్రధాని నరేంద్ర మోదీ పదునైన విమర్శలు

Just In

01

Telangana Govt: విద్యుత్ సబ్సిడీల్లో అన్నదాతదే అగ్రభాగం.. వ్యవసాయ రంగానికి రూ.13,499 కోట్లు!

Akhil Akkineni: అఖిల్ అక్కినేని గురించి ప్రొడ్యూసర్ చెప్పింది వింటే గూస్‌బంప్స్ రావాల్సిందే..

Thummala Nageswara Rao: యూరియా కొరత లేదు.. ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తే తాట తీస్తాం.. మంత్రి తుమ్మల ఫైర్!

Jana Nayagan: విజయ్ ‘జన నాయకుడికి’ చివరినిమిషంలో కొర్రీలు పెడుతున్న సెన్సార్ బోర్డ్.. ఎందుకంటే?

GHMC: జీహెచ్‌ఎంసీలో విలీన ప్రాంతాలకు మహర్దశ.. బడ్జెట్‌లో రూ.2,260 కోట్లు కేటాయింపు!