Rahul Gandhi: మోదీపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi (imagecredit:twitter)
జాతీయం

Rahul Gandhi: బీహార్ ఎన్నికల ప్రచారంలో మోదీపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

Rahul Gandhi: ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahula Gandhi) సవాల్ విసిరారు. బిహార్(Bihar) ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నలంద(Nalandha)లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాకిస్థాన్‌తో యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పదే పదే చెబుతున్నారని గుర్తు చేశారు. ఇది నిజం కాకపోతే ట్రంప్ అబద్ధం చెబుతున్నారని ప్రధాని మోదీ(Prime Minister Modi) చెప్పాలని సవాల్ చేశారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడైనా మోదీ ఈ విషయంపై మాట్లాడొచ్చని రాహుల్ అన్నారు.

భారత్‌ను భయపెట్టేందుకు..

అయితే, మోదీ(Modhi) ఈ పని చేస్తారని తాను అనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ఎందుకంటే ట్రంప్(Trump) ముందు ఆయన నిలబడలేరని విమర్శించారు. అమెరికా అధ్యక్షుడిని ఎదుర్కొనే ధైర్యం మోదీకి లేదన్నారు. 1971 బంగ్లాదేశ్(Bangladesh) యుద్ధంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ(Indhira Gandhi) అమెరికా(USA)కు భయపడలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారత్‌ను భయపెట్టేందుకు అమెరికా నౌవికా దళాన్ని పంపినా కూడా ఇందిరా గాంధీ జంకలేదన్నారు. ‘‘మీరు చేసేది మీరు చేయండి. మేం చేసేది మేం చేస్తాం’’ అని అమెరికాకు తేల్చి చెప్పారని వివరించారు.

Also Read: Former Maoist: ఆరేళ్లక్రితం లొంగిపోయిన మావోయిస్టు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా.. ఫొటో ఇదిగో

నితీశ్ రిమోట్ కంట్రోల్..

అమెరికా విషయంలో ఒక మహిళకు ఉన్న ధైర్యం కూడా మోదీకి లేదని, అంత పిరికితనం ఎందుకని విమర్శించారు. ఇక, బిహార్ సీఎం నితీశ్(CM Nitish) పైనా రాహుల్ ఫైరయ్యారు. రాష్ట్రాన్ని మార్చానని ఆయన చెప్పుకుంటున్నారని, కానీ నేడు బిహార్ పేపర్ లీకేజీలు, పేలవమైన ఆరోగ్య మౌలిక సదుపాయాలకు పర్యాయపదంగా మారిందని ఆరోపించారు. ప్రజలు ఇప్పటికీ నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి ప్రాథమిక సౌకర్యాలకు దూరంగా ఉన్నారని రాహుల్ గాంధీ అన్నారు. నితీశ్ రిమోట్ కంట్రోల్ మోదీ చేతిలో ఉందని విమర్శించారు.

Also Read: Nalgonda District: నల్గొండ శిశు విక్రయంలో.. వెలుగులోకి సంచలన నిజాలు!

Just In

01

KCR: 27 లేదా 28న పాలమూరుకు కేసీఆర్?.. ఎందుకో తెలుసా?

Student Suicide Attempt: గురుకుల క‌ళాశాల‌ భ‌వ‌నం పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

Ramchander Rao: సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌కు బీజేపీ రాంచందర్ రావు ప్రశ్న ఇదే

Bhatti Vikramarka: తెలంగాణలో అత్యధిక ప్రజావాణి అర్జీలను పరిష్కరించిన కలెక్టర్‌.. ఎవరో తెలుసా..?

New Sarpanch: ఎలుగుబంటి వేషంలో నూతన సర్పంచ్.. కోతుల సమస్యకు చెక్!