Jubliee Hills Bypoll Live Updates: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ మెుదలు కాగా.. ఓటు వేసేందుకు ప్రజలు క్యూ కడుతున్నారు. సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. నియోజకవర్గంలోని 4.01 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మరోవైపు ఉపఎన్నిక కోసం నియోజకవర్గం వ్యాప్తంగా 407 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.
సీఈసీ సీరియస్..
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో నాన్ లోకల్స్ పెద్ద మెుత్తంలో సంచరిస్తుండటంపై పలు పార్టీలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి సైతం సీరియస్ అయ్యారు. నియోజకవర్గంలోని స్థానికేతరులపై కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకూ నాన్ లోకల్స్ పై 3 ఎఫ్ఐఆర్ లు నమోదైనట్లు ఆయన పేర్కొన్నారు. అయితే పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతున్న వెల్లడించారు.
ఉ.11 గం. జరిగిన పోలింగ్ ఎంతంటే?
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే 11 గంటల వరకూ 20.76 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. అయితే 4 గంటలు దాటినా కనీసం 25 శాతం కూడా పోలింగ్ దాటకపోవడం గమనార్హం. దీన్ని బట్టి పోలింగ్ ప్రక్రియ మందకొడిగా సాగుతున్నట్లు తెలుస్తోంది.
ఓటు వేసిన ప్రధాన అభ్యర్థులు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మాట్లాడిన ఆయన.. పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్నట్లు చెప్పారు. తొలి 45 నిమిషాల్లోనే 70-100 ఓట్లు పోలైనట్లు తెలిపారు. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీత.. ఎల్లారెడ్డి గూడ నవోదయనగర్ పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేశారు. అనంతరం మాట్లాడుతూ.. పోలింగ్ ఏర్పాట్లు సరిగా లేవని అంసతృప్తి వ్యక్తం చేశారు. ఓటర్లు చాలాసేపు క్యూలైన్ లో ఉండాల్సి వస్తోందని అన్నారు. అటు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. శ్రీనగర్ కాలనీలోని పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేశారు.
9 గం.ల వరకూ 10.2% పోలింగ్..
జూబ్లీహిల్స్ నియోజక వర్గంలో ఉదయం 9 గంటల వరకూ 10.2 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పోలింగ్ సరళి చాలా నెమ్మదిగా ఉన్నట్లు పేర్కొన్నారు. వెంగళరావు నగర్, షేక్ పేటలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఈవీఎంలు మెురాయిస్తున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల ఆయా కేంద్రాల వద్ద ఓటు వేయడానికి వచ్చిన ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
Also Read: Delhi Red Fort Blast: ఢిల్లీ పేలుడు మిస్టరీని ఛేదిస్తున్న పోలీసులు.. పుల్వామా వ్యక్తికి నకిలీ పత్రాలతో కార్ విక్రయం
120వ బూత్ వద్ద ఉద్రిక్తత
వెంగళరావు నగర్ లోని 120వ నెంబర్ పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓటర్లకు బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇరు వర్గాలను శాంతింపజేశారు. డబ్బులు పంచే విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కాంగ్రెస్ vs బీఆర్ఎస్
వెంగళరావునగర్ పోలింగ్ బూత్ నెంబర్ 120 వద్ద ఉద్రిక్తత
ఓటర్లకు బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని గొడవకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు
దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య కాసేపు తోపులాట pic.twitter.com/uHzqAJnTH0
— BIG TV Breaking News (@bigtvtelugu) November 11, 2025
