Varanasi title: సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం టైటిల్‌ను ఎట్టకేలకు అధికారికంగా ప్రకటించారు. ఈ మెగా యాక్షన్ అడ్వెంచర్ సినిమాకు ‘వారణాసి’ అనే శక్తివంతమైన టైటిల్‌ను ఖరారు చేశారు. కొద్ది రోజులుగా సినీ వర్గాల్లో అభిమానులలో చర్చనీయాంశమైన ఈ టైటిల్, రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ‘గ్లోబ్ ట్రాటర్’ అనే భారీ ఈవెంట్‌లో రివీల్ చేశారు. టైటిల్ ప్రకటనతో పాటు, సినిమాకు సంబంధించిన ఒక చిన్న గ్లింప్స్ ను కూడా చిత్రబృందం విడుదల చేసింది. ఈ గ్లింప్స్ లో మహేష్ బాబు మునుపెన్నడూ చూడని ఒక పవర్ఫుల్ లుక్ లో కనిపించడం అభిమానులను ఉర్రూతలూగించింది. ముఖ్యంగా, మహేష్ బాబు నంది పై గంభీరంగా స్వారీ చేస్తూ, చేతిలో త్రిశూలం పట్టుకుని ఉన్న దృశ్యం ప్రేక్షకులకు గూస్‌బమ్స్ తెప్పించేలా ఉంది.
Read also-Prabhas new project: స్పిరిట్ తర్వాత కొరియోగ్రాఫర్‌ను దర్శకుడిగా పరిచయం చేయనున్న ప్రభాస్.. ఎవరంటే?
ఇప్పటివరకు ‘SSMB 29’ అనే వర్కింగ్ టైటిల్‌తో వ్యవహరించిన ఈ ప్రాజెక్ట్‌కు ‘వారణాసి’ అనే పేరు పెట్టడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారతదేశంలో అత్యంత పురాతనమైన, పవిత్రమైన నగరాల్లో ఒకటైన వారణాసిని టైటిల్‌గా ఎంచుకోవడం, ఈ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ కథా నేపథ్యంపై మరిన్ని అంచనాలను పెంచుతోంది. ప్రపంచాన్ని చుట్టి వచ్చే ఒక సాహసికుడి పాత్రలో మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమా కథలో వారణాసి పాత్ర, దాని ఆధ్యాత్మిక, చారిత్రక నేపథ్యం ఎంత కీలకం కాబోతోందో తెలుసుకోవాలని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.
How's #Varanasi TITLE CARD ? pic.twitter.com/O0bpUqNORi
— Let's X OTT GLOBAL (@LetsXOtt) November 15, 2025
Read also-Globe Trotter event: గ్లోబ్ ట్రూటర్ ఈవెంట్ కోసం సాహసం చేసిన మహేశ్ అభిమాని.. ఏం గుండెరా వాడిది..
కె.ఎల్. నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇందులో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానున్నట్లు ప్రచారం జరుగుతుండగా, త్వరలోనే దీనిపై కూడా మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ‘వారణాసి’ టైటిల్ ప్రకటనతో మహేష్ బాబు అభిమానులు, సినీ ప్రేమికులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు.
MAHESHwarudi Rudra Thandavam 🔱🔥 #Varanasi #GlobeTrotter @urstrulyMahesh pic.twitter.com/JbWebvIbrp
— SSR (@SSRtweetz) November 15, 2025
