Globe Trotter event: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న భారీ చిత్రం ‘SSMB29’. తాజాగా ఈ చిత్రం గ్లోబ్ ట్రూటర్ ఈవెంట్ కోసం మహేష్ అభిమానులు విదేశాల నుంచి కూడా వస్తున్నారు. తాజాగా ఈ ‘గ్లోబ్ ట్రూటర్’ ఈవెంట్ కోసం ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరం నుండి ఒక అభిమాని చేసిన సాహసం అందరి దృష్టిని ఆకర్షించింది. సునీల్ అవుల అనే ఈ అభిమాని, కేవలం ఈ కార్యక్రమానికి హాజరవ్వడానికి ఏకంగా 12 గంటల విమాన ప్రయాణం చేసి, 6817 కిలోమీటర్లు దూరం ప్రయాణించి హైదరాబాద్ లో ఉన్న రామోజీ ఫిలిం సిటీ చేరుకున్నారు. ఈ విషయాన్ని సునీల్ అవుల అనే వ్యక్తే స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మహేష్ బాబుపై ఆయనకు ఉన్న అపారమైన అభిమానానికి ఇది నిదర్శనం. ‘గ్లోబ్ ట్రూటర్’ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్ రివీల్ ఇతర విశేషాల కోసం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ లో నవంబర్ 15న ఒక గ్రాండ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ పై దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో ఉన్న మహేష్ అభిమానులలో కూడా తీవ్రమైన ఆసక్తి నెలకొంది.
కార్తికేయ స్పందన
ఈ వీరాభిమాని అంకితభావం చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, రాజమౌళి కుమారుడు కార్తికేయ ఈ పోస్టుకు స్పందిస్తూ, సునీల్ అవుల అంకితభావాన్ని మనస్ఫూర్తిగా ప్రశంసించారు. ఆయన సునీల్ పోస్ట్‌ను షేర్ చేస్తూ, “ఒక్క తెలుగువాడు మాత్రమే ఫీల్ అయ్యే బిగ్గెస్ట్ ఎమోషన్… SKY ALSO NOT THE LIMIT…” అంటూ వ్యాఖ్యానించారు. ఈ అభిమాని ప్రయత్నం పట్ల కార్తికేయ ఎంతగానో కదిలిపోయారు.
Read also-Daggubati Heroes: వరుసగా నాలుగో సారి కోర్టుకు హ్యాండ్ ఇచ్చిన దగ్గుబాటి హీరోలు..
ఈ ‘గ్లోబ్ ట్రూటర్’ ఈవెంట్‌లో సినిమా టైటిల్ రివీల్ తో పాటు, ప్రత్యేకమైన దృశ్యాలు గ్లింప్స్ విడుదల కానున్నాయి. ఈ వేడుక కోసం చిత్ర యూనిట్ ప్రత్యేకమైన పాస్‌పోర్ట్ లాంటి పాస్‌లను రూపొందించడం అభిమానులను మరింత ఉత్సాహపరిచింది. ఈ ఈవెంట్‌కు మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ రాజమౌళి వంటి ప్రధాన తారాగణం హాజరవుతున్నారు. మహేష్ బాబు కోసం ఆస్ట్రేలియా నుంచి అభిమాని వచ్చిన ఈ సంఘటన, తెలుగు సినిమాపై, ముఖ్యంగా మహేష్ బాబుపై అభిమానులకు ఉన్న ప్రేమాభిమానాలను, వారి అంకితభావాన్ని మరోసారి చాటిచెప్పింది.
After 12hr of flight and 6817 kms from streets of Perth to RFC Hyderabad. #JaiBabu @urstrulyMahesh #GlobeTrotter day. pic.twitter.com/eWZzlwg5gB
— Sunil Avula (@avulasunil) November 15, 2025
