prabhas-next-movie( image :X)
ఎంటర్‌టైన్మెంట్

Prabhas new project: స్పిరిట్ తర్వాత కొరియోగ్రాఫర్‌ను దర్శకుడిగా పరిచయం చేయనున్న ప్రభాస్.. ఎవరంటే?

Prabhas new project: పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ‘కల్కి 2898 ఏడీ’తో పలకరించిన తర్వాత, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న ‘స్పిరిట్’ వంటి అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాలతో ప్రభాస్ సినీ పరిశ్రమలో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకునే పనిలో ఉన్నారు. ‘ది రాజాసాబ్’ ఇప్పటికే విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే, డార్లింగ్ ఫ్యాన్స్‌కు మరింత ఉత్సాహాన్ని ఇచ్చే ఒక ప్రత్యేక వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ‘నాటు నాటు’ పాటకు గాను ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌తో ప్రభాస్ కలిసి ఒక కొత్త ప్రాజెక్ట్‌లో భాగం కాబోతున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది దేశవ్యాప్తంగా అంచనాలను పెంచే మాస్ ఎంటర్‌టైనర్‌గా, ప్రేక్షకులు మునుపెన్నడూ చూడని ‘విజువల్ స్పెక్టాకిల్ గా ఉండబోతుందని సమాచారం. ఈ సినిమా కోసం ప్రభాస్ ప్రేమ్ రక్షిత్ జతకట్టడం నిజంగా అభిమానులకు ఒక గొప్ప ట్రీట్ అవుతుంది.

Read also-Daggubati Heroes: వరుసగా నాలుగో సారి కోర్టుకు హ్యాండ్ ఇచ్చిన దగ్గుబాటి హీరోలు..

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక అత్యంత విశ్వసనీయ వర్గం వెల్లడించిన వివరాల ప్రకారం, “ఆస్కార్-విజేత కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌తో ప్రభాస్ త్వరలో కలిసి పనిచేయనున్నారు. ఈ చిత్రం ప్రపంచం ఇంతకుముందు చూడని ఒక గొప్ప దృశ్య కావ్యం అవుతుంది.” ఈ కొత్త ప్రాజెక్ట్ గురించిన మెగా ప్రకటన త్వరలోనే వెలువడనుందని కూడా ఆ వర్గాలు తెలిపాయి. అయితే, ఈ ఇద్దరు ప్రముఖులు ఏ స్థాయిలో, ఏ పాత్రలో కలిసి పనిచేయబోతున్నారనే పూర్తి వివరాలు మాత్రం ప్రస్తుతం గోప్యంగా ఉంచబడ్డాయి. ఇది కేవలం ఒక పాట కోసమేనా లేక పూర్తి సినిమాకు నృత్య దర్శకత్వం వహించనున్నారా అనేది తెలియాల్సి ఉంది. మరి కొందరు అయితే ఈ సినిమాకు ప్రభాస్ నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తాడని అందులో ఆయన చేయడం లేదని కూడా పలు కథనాలు వినిపిస్తున్నాయి. దీని గురించి ఎక్కడా అధికారికి ప్రకటన రాలేదు.

Read also-SSMB29 story leak: టైటిల్ గ్లింప్స్ ఈవెంట్ పూర్తవక ముందే లీకైన ‘SSMB29’ స్టోరీ.. సంబరాల్లో ఫ్యాన్స్

ప్రభాస్ రాబోయే సంవత్సరాలలో తిరుగులేని లైనప్‌ను కలిగి ఉన్నారు. ముఖ్యంగా 2026 సంవత్సరంలో రెబల్ స్టార్ నుండి ఏకంగా మూడు భారీ చిత్రాలు విడుదల కానున్నాయి.

1. ది రాజా సాబ్ (The Raja Saab): మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న హారర్ కామెడీగా ఇండియన్ సినీ పరిశ్రమలో నిలవనుంది. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కథానాయికలుగా నటిస్తుండగా, సంజయ్ దత్ నెగెటివ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలోకి వస్తుంది.

2. ఫౌజీ (Fauzi): హను రాఘవపూడి దర్శకత్వంలో రాబోతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా స్వాతంత్ర్యం రాకముందు నాటి కథాంశంతో రూపొందుతోంది. ఇమాన్వి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ఫౌజీ’ 2026 ఆగస్టు 14న విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

3.స్పిరిట్ (Spirit): సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న ఈ కాప్ యాక్షన్ డ్రామా కోసం ప్రభాస్ పూర్తిగా తన శరీరాకృతిని మార్చుకున్నారు. 2025 నవంబర్ చివరిలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. వివేక్ ఒబెరాయ్, త్రిప్తి డిమ్రీ, ప్రకాష్ రాజ్ వంటి నటీనటులు ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ వరుస ప్రాజెక్టులతో పాటు, ఆస్కార్ విన్నర్ ప్రేమ్ రక్షిత్‌తో ప్రభాస్ కలయిక అభిమానుల అంచనాలను మరింత పెంచుతూ, బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలకు నాంది పలకడం ఖాయం.

Just In

01

Varanasi Glimpse: ‘వారణాసి’ టైటిల్ గ్లింప్స్ చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే.. మహేష్ బాబు ఇరగదీశాడుగా

New Bus Stations: ప్యాసింజర్లకు గుడ్‌న్యూస్.. గ్రేటర్ హైదరాబాద్‌లో మరో 3 బస్‌స్టాండ్లు.. ఎక్కడెక్కడో తెలుసా?

Farooq Abdullah: ఉగ్రదాడిలో వైద్యుల ప్రమేయంపై ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు… తీవ్ర వివాదాస్పదం

AV Ranganath: బతుకమ్మకుంట బాగుందా? వాకర్లతో ముచ్చటించిన హైడ్రా కమిషనర్!

Rahul Gandhi: వెరీ గుడ్ రేవంత్ టీమ్ వర్క్ సూపర్ గో హెడ్.. రాహుల్ గాంధీ కాంప్లిమెంట్!