Happy Childrens Day: ప్రతి సంవత్సరం నవంబర్ 14న దేశవ్యాప్తంగా బాలల దినోత్సవం (Children’s Day) ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజు భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ గారి జన్మదినం. పిల్లలపై ఆయనకున్న అపారమైన ప్రేమ, నమ్మకం, దేశ భవిష్యత్తుపై ఆయన చూపిన దృష్టిని గుర్తుచేసుకుంటూ ఈ రోజును దేశమంతా పిల్లల పండుగగా జరుపుకుంటుంది. చాచా నెహ్రూ పిల్లలను ఎంతో ప్రేమించేవారు. ఆయన మాటల్లో “పిల్లలు ఇవాళ్టి పౌరులు కాదు, రేపటి దేశ నిర్మాతలు.” అని ఆయన కొనియాడారు.
ఈ సందేశమే బాలల దినోత్సవానికి అసలైన అర్థం. ఈ రోజున పిల్లలకు మన ప్రేమను, ప్రోత్సాహాన్ని తెలియజేసే సందేశాలు, కోట్స్ ఇక్కడ మీ కోసం కొన్ని ఉన్నాయి. వాటిని చదివి తెలుసుకోండి.
బాలల దినోత్సవం 2025 శుభాకాంక్షలు (Wishes):
“పిల్లలు దేవుని బహుమతి – వారి నవ్వు మన జీవితానికి వెలుగు. హ్యాపీ చిల్డ్రన్స్ డే 2025!”
“ప్రతి పిల్లవాడిలో ఒక ఆశ్చర్య ప్రపంచం దాగి ఉంటుంది.. దాన్ని ప్రేమతో వెలికితీయండి!”
“మీ చిన్నారుల చిరునవ్వు ప్రపంచాన్ని మార్చగలదు.. బాలల దినోత్సవ శుభాకాంక్షలు!”
“పిల్లల హృదయం పాపములేని పువ్వులాంటిది.. దానిని ఎప్పుడూ ఆనందంతో ఉంచండి.”
“పిల్లలే దేశ భవిష్యత్తు.. వారి కలలకు రెక్కలు కట్టండి. హ్యాపీ చిల్డ్రన్స్ డే!”
చిన్నారుల చిరునవ్వు మనసును మాయ చేస్తుంది, వారి కలలు ప్రపంచాన్ని మార్చగలవు. హ్యాపీ చిల్డ్రన్స్ డే!
పిల్లల హృదయం పాపములేని పువ్వులాంటిది.. దానిని ఎప్పుడూ ఆనందంతో ఉంచండి.. బాలల దినోత్సవ శుభాకాంక్షలు!
పిల్లలే దేశ భవిష్యత్తు.. వారి కలలకు రెక్కలు కట్టండి. హ్యాపీ చిల్డ్రన్స్ డే 2025!
పిల్లలు మన ఆశ, మన ప్రేరణ, మన గర్వం. వారిని ప్రేమతో, సహనంతో పెంచుదాం.. హ్యాపీ బాలల దినోత్సవం!
పిల్లల నవ్వు విన్నప్పుడు ప్రపంచం మరింత అందంగా అనిపిస్తుంది. ఆ నవ్వు ఎప్పుడూ అలాగే ఉండాలి!
ప్రతి పిల్లవాడు ఒక కథ, ప్రతి నవ్వు ఒక ఆశ. బాలల దినోత్సవం సందర్భంగా అందరికీ హ్యాపీ విషెస్!
పిల్లల మనసు శుద్ధి, ప్రేమ, ఆనందం నిండినది. వారిని ప్రోత్సహించండి.. వారు మన భవిష్యత్తు!
Also Read: Kaleshwaram Project: కాళేశ్వరం కమిషన్ పై విచారణ వాయిదా.. మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయన్న హైకోర్టు
చాచా నెహ్రూ కోట్స్ ఇవే..
“ఇవాళ్టి పిల్లలే రేపటి భారత పౌరులు”
“సరైన విద్య వలెనే సమాజం అభివృద్ధి చెందుతుంది.”
“పిల్లలు తోటలోని మొగ్గలు లాంటివారు.. ప్రేమతో పెంచాలి.”
“దేశ సేవే నిజమైన పౌరుడి లక్షణం.”
