Collector Santhosh: ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు కృషి
Collector Santhosh ( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Collector Santhosh: ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు కృషి.. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలి కలెక్టర్ సంతోష్

Collector Santhosh: విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని మౌలిక సౌకర్యాలను కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. ఉండవెల్లి మండలం, బొంకూరు గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్, డిజిటల్ స్క్రీన్ల ద్వారా బోధించే పాఠ్యాంశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులతో మాట్లాడుతూ.. యు డైస్ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, పాఠశాల నిధులను నిబంధనల ప్రకారం ఖర్చు పెట్టాలని ఆదేశించారు. పాఠశాల తరగతి గదిలోనే అంగన్‌వాడీ కేంద్రాన్ని నిర్వహిస్తుండటాన్ని గమనించిన కలెక్టర్, అంగన్‌వాడీ కేంద్రానికి త్వరలోనే పక్కా భవనం నిర్మించాలని సంబంధిత అధికారులతో మాట్లాడారు.

Also Read: Gadwal Collector: పునరావాస కేంద్రంలో పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేయాలి : కలెక్టర్ బి.యం సంతోష్ 

నెల రోజుల్లో ఇంటర్నెట్ సౌకర్యం

పాఠశాలలో గ్రంథాలయ, సమాచార, క్రమశిక్షణ, ఆరోగ్య, ఫుడ్ కమిటీల పనితీరును కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో నెల రోజుల్లోగా ఇంటర్నెట్ కనెక్షన్ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. అనంతరం, పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులతో కలిసి కలెక్టర్ మొక్క నాటారు. ఈ పర్యటనలో విద్యాశాఖ ఏపీఓ శ్రీనివాసులు, పాఠశాల జీహెచ్ఎం మద్దిలేటి, పంచాయతీ సెక్రటరీ రజియా బేగం తదితరులు పాల్గొన్నారు.

Also Read: New Liquor Shops: గద్వాల జిల్లాలో లిక్కర్ షాపులకు దరఖాస్తు చేసుకోండి : కలెక్టర్ సంతోష్

Just In

01

Municipal Elections: మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్.. ఉత్తర్వులు జారీ..!

Nandini Suicide: ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ సీరియల్ నటి నందిని.. ఎందుకంటే?

Cyber Crime Scam: ఖాకీలకే సైబర్​ క్రిమినల్స్ ఉచ్చు… ఏం చేశారంటే?

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి డేట్ కూడా ఫిక్సయిందా?

Spirit: ప్రభాస్, సందీప్ వంగా ఇవ్వబోయే న్యూ ఇయర్ ట్రీట్ ఇదేనా?