New Liquor Shops: రాష్ట్రంలో కొత్తగా వైన్‌షాపుల (New Liquor Shops) నిర్వహణ కోసం ఎక్సైజ్ శాఖ దరఖాస్తుల స్వీకరణ కు గత నెల 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించి, 23 న విత్తనాలు కేటాయింపుకు లక్కీడ్రా నిర్వహించనున్నారు. డ్రాలో ఎంపికైన షాపుల యజమానులు 24 తేదీ వరకు మొదటి విడత లైసెన్సు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ 1 నుండి కొత్త మద్యం షాపులో మద్యం విక్రయాలు ప్రారంభిస్తారు.
జిల్లాలో 34 లిక్కర్ షాపుల కోసం దరఖాస్తు
జోగులాంబ గద్వాల జిల్లా (Jogulamba Gadwal District) లో లిక్కర్ షాపుల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సంతోష్(Collector Santhosh) కోరారు. కలెక్టరేట్ హాల్ లో సంబంధిత అధికారులతో లిక్కర్ షాపుల రిజర్వేషన్ ను లాటరీ పై తీశారు. మొత్తం జిల్లాలో 34 లిక్కర్ షాపుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అందులో ఎస్సీలకు 6, గౌడ కులస్తులకు 5 మద్యం షాపులు కేటాయించడం జరిగిందన్నారు. గద్వాల మున్సిపాలిటీ లిక్కర్ షాప్ 4, 8,అయిజ మున్సిపాలిటీ షాప్ నెంబర్ 3, మల్దకల్ గ్రామం షాప్ నంబర్-2 ఎర్రవల్లి గ్రామం షాప్ నంబర్ 1 లిక్కర్ షాపులు గౌడ కులస్తులకు కేటాయించడం జరిగిందన్నారు.
Also Read: Wedding tragedy: 35 ఏళ్ల మహిళను పెళ్లాడిన 75 ఏళ్ల తాత.. తెల్లారేసరికి కన్నుమూత
23 షాపులను ఓపెన్ క్యాటగిరి
గద్వాల మున్సిపాలిటీ షాప్ నెంబర్ 7 అయిజ మున్సిపాలిటీ షాప్ నెంబర్ 1, 2, మల్దకల్ షాప్ నెంబర్ 1, వడ్డేపల్లి షాప్ నెంబర్ 2, మానవపాడు షాప్ నెంబర్ 2 లిక్కర్ షాపులను ఎస్సీలకు కేటాయించడం జరిగిందన్నారు. మిగతా 23 షాపులను ఓపెన్ క్యాటగిరిగా నిర్ధారించారు.. లిక్కర్ షాపుల యాక్షన్ లో పాల్గొనదల్చిన వారు ఈనెల 26వ తేదీ నుండి వచ్చే నెల 18వ తేదీ వరకు ఎక్సైజ్ ఆఫీసులో దరఖాస్తుల తో పాటు మూడు లక్షల రూపాయల డీడిని అందజేయాలన్నారు. మధ్య లిక్కర్ షాపు మంజూరైన వారు డిసెంబర్ ఒకటో తేదీ నుండి షాప్ లను ప్రారంభించుకోవాల్సి ఉంటుంది.
మద్యం షాపులకు 2027 నవంబర్ 30 వరకు కొత్తగా లైసెన్స్
గద్వాల నియోజకవర్గానికి 21, అలంపూర్ నియోజకవర్గానికి 13 చొప్పున లిక్కర్ షాపులు ఉన్నాయి. నూతన మద్యం షాపులకు 2027 నవంబర్ 30 వరకు కొత్తగా లైసెన్స్ పొందిన యజమా సులు రెండేళ్ల పాటు మద్యం విక్రయాలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే గత రెండేళ్ల క్రితం మద్యం షాపుల నిర్వహణ సమయంలో దరఖాస్తు ఫీజు రెండు లక్షలు ఉండగా ఇప్పుడు మరో లక్ష రూపాయలు పెంచి మూడు లక్షలకు నిర్ణయించారు. ఒక్క వ్యక్తి మూడు లక్షల రూపాయల చొప్పున చెల్లిస్తూ ఎన్ని షాపులకైనా దరఖాస్తు చేసు కునే వెసులుబాటు కల్పించారు. దరఖాస్తు రుసుము మూడు లక్షలు తిరిగి చెల్లించబడదు.
దరఖాస్తుల కోసం సిండికేటు.!
లక్కీ డ్రా ద్వారా మద్యం షాపులను ఎక్సైజ్ శాఖ కేటాయిస్తుండడంతో ఒక్కో దరఖాస్తు చేస్తే షాపు లభిస్తుందో లేదో అన్న అనుమానంతో ‘సిండికేట్’ గా ఏర్పడుతున్నారు. 10 వేల నుంచి లక్షా రెండు లక్షల వరకు స్థాయికి బట్టి తలా కొంత పోగేసి మద్యం షాపుల కోసం దరఖాస్తు చేసేందుకు జట్టు కడుతున్నారు. మద్యం షాపు నిర్వహించే ప్రస్తుత వ్యాపారులతో పాటు కొత్తవారు కూడా ఈ రంగం లోకి రావడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కువగా వ్యాపారం సాగే మద్యం షాపుల వివరాలను సేకరించి, ఆ షాపులకు ఎక్కువ దరఖాస్తులు చేసి డ్రాలో దక్కించుకునే విధంగా వ్యూహరచన చేస్తున్నారు.
దరఖాస్తు ఫీజు 3 లక్షలు
దీనితో దరఖాస్తు ఫీజు 3 లక్షల రూపాయలు తిరిగి వచ్చే పరిస్థితి లేక పోవడంతో, ఒక్కడే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు చేసే పరిస్థితి లేకపోవడంతో కూటమిగా ఏర్పడుతున్నారు. ఎవరెంత పెట్టుబడి పెడితే ఒకవేళ గనుక ఆ షాపు డ్రాలో దక్కితే వారికి అందులో డబ్బులు చెల్లించిన ప్రకారం వాటా ఇచ్చే విధంగా ముందుగానే ‘అగ్రిమెంట్’ చేయిస్తున్నారు. దీంతో పదివేల రూపాయలు ఉన్నా పది నుంచి 20 మంది కలిసి ఒక దరఖాస్తు చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు.
అలాగే లక్ష 50,000, ఇద్దరు కలిసి లక్షన్నర చొప్పున, మరికొందరు సాంతంగానే ఐదు నుంచి పది షాపుల వరకు, ఇంకొందరు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తు చేయడానికి ప్రయత్నాలు ఆల్రెడీ మొదలుపెట్టారు. గత నెల రోజుల నుండి కొత్త మద్యం షాపుల నిర్వహణ కోసం ఎక్సైజ్ శాఖ ఎప్పుడు ప్రకటిస్తుందోనన్న ఆత్రుతతో ఎదురుచూస్తుండగా, గురువారం ఎక్సైజ్ శాఖ ప్రకటనతో ఔత్సాహికులు తమ ప్రయ త్నాలను మరింత ముమ్మరం చేశారు.
అంతా అదృష్టంపైనే
పూర్తిగా అదృష్టం పైనే మద్యం షాపు కేటాయింపు ఆధారపడి ఉండడంతో దరఖాస్తు ఫీజు చెల్లించడంతోపాటు ‘లక్కు ఎవరిపై ఉందనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఎవరి పేరు పై బాగుందో చూసి చెప్పండని, జాతకాలను సైతం చూపించుకుంటున్నారు. పేర్లలో అక్షరాలు, సంఖ్యల ఆధారంగా జాతకం బాగుంటే లక్కీ డ్రాలో వైన్ షాపు దక్కుతుందని జాతకం చూసి చెప్పే పండితుల సూచన మేరకు ఆ ‘నామ’దేయుల కోసం వెతుకులాట ప్రారంభించారు. అన్నా నీ పేరు మీద జాతకం చూపిస్తే ‘బలం’ బాగుందని చెప్పారు.. దరఖాస్తు ఫీజు నేనే కడతా.. డ్రాలో షాపు వస్తే కొంత ‘గిఫ్ట్’ ఇస్తా.. షాపు కోసం నీ పేరుపై దరఖాస్తు చేస్తానంటూ డబ్బున్న కొందరు జాతక ప్రకారం అనుకూలమైన వారి వెంట పడుతున్నట్లు ప్రచారం సాగుతుంది.
Also Read: H1B Visa Fee: హెచ్-1బీ ఫీజు పెంచిన ట్రంప్‌కి షాక్.. భారత్‌కు వచ్చే యోచనలో అమెరికా కంపెనీలు!