Teacher Suspended: ఇంగ్లీష్ టీచర్ ఇన్ స్టాలో రీల్స్
Teacher Suspended ( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ, లైఫ్ స్టైల్

Teacher Suspended: పిల్లలకు పాఠాలు చెప్పకుండా.. ఇంగ్లీష్ టీచర్ ఇన్ స్టాలో రీల్స్.. సస్పెండ్ చేసిన అధికారులు!

Teacher Suspended:  ఖమ్మం జిల్లా మామిళ్లగుడెం ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న బానోత్ గౌతమి తనను సస్పెండ్ చేయడంపై గౌతమి స్పందించారు. ఇక జన్మలో రీల్స్ చేయనని కన్నీళ్లు పెట్టుకున్నారు. క్షమాపణలు కోరారు. ఉపాధ్యాయురాలిగా తన వృత్తికి ఎప్పుడూ అన్యాయం చేయలేదన్నారు. అవివేకంతో, తెలియక కమర్షియల్ రీల్ చేశానన్నారు. సైనిక సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తున్నామని చెబితే తాను ప్రైవేట్ స్కూల్ కు వెళ్లానన్నారు.

Also Read: Teacher Suspended: మద్యం మత్తులో ఉపాధ్యాయుడు విధులు.. ఊగుతూ పిల్లలకు పాఠాలు!

విధి నిర్వహణకు విరుద్ధంగా

సోషల్ మీడియాలో తనపై విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయని ఆవేదన చెందారు. తాను ఎక్కడా ఎలాంటి నిషేధాగ్నలు అతిక్రమించలేదని చెప్పుకొచ్చారు . ఇన్ స్టా రీల్స్ పట్ల తనను ఎవరూ హెచ్చరించలేదన్నారు. పిల్లల రీల్స్ తప్ప, తన విధి నిర్వహణకు విరుద్ధంగా ఎప్పుడూ ప్రవర్తించలేదన్నారు. ఇంటింటికీ తిరిగి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరానన్నారు. స్కూలులో ఎప్పుడూ వీడియోలు చేయలేదన్నారు. తన ఫ్రీ టైంలో మాత్రమే రీల్స్ చేశానని చెప్పారు. అన్యాయంగా తనను సస్పెండ్ చేశారని ఆవేదన చెందారు. తనను క్షమించాలని, ఇకపై రీల్స్ చేయనని చెప్పారు .

Also Read: CI Mahender Reddy: రాత్రి వేళల్లో అలా చేశారా? ఇక మీ పని అంతే.. అల్లరి మూకలకు తనదైన స్టైల్ లో సీఐ వార్నింగ్!

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?