Teacher Suspended: మద్యానికి బానిసైన ఉపాధ్యాయుడు ప్రతిరోజు పాఠశాలకు తాగి వస్తున్న ఎస్జీటీ ఉపాధ్యాయుడు ఎంఈఓ(MEO) విచారణ అనంతరం కలెక్టర్ సస్పెండ్ చేశాడు. విద్యార్థి తప్పు తోవలో నడిస్తే, ఆ విద్యార్థిని మంచి నడవడిలోకి తీసుకొచ్చేది కేవలం ఉపాధ్యాయులు మాత్రమే. ఎందుకంటే గురువు మాట విని చెడిపోయిన వాడు ఈ లోకంలో లేడు. ఎలాంటి వారినైనా మార్చగలిగే శక్తి కేవలం ఆ వృత్తిలో కొనసాగుతున్న టీచర్ కు మాత్రమే ఉంటుంది. అందుకే అన్నారు పెద్దలు ‘మాతృదేవో భవ.. పితృదేవో భవ.. ఆచార్య దేవోభవ’ అని. చెడు మార్గంలో వెళ్లే విద్యార్థులను కేవలం మాస్టారు మాత్రమే సక్రమమైన మార్గంలో నడపగలడు. బతుకు పాఠాలు నేర్పించాల్సిన అలాంటి ఉపాధ్యాయుడే చెడు వ్యసనాలకు బానిసైతే ఆ విద్యార్థుల పరిస్థితి ఏం కావాలి. విద్యాబుద్ధులు నేర్పించి విద్యార్థులకు ఆదర్శంగా ఉండాల్సిన గురువే(Teacher) ప్రతిరోజు పాఠశాలకు మద్యం సేవించి వస్తున్నాడు. అది చాలదు అన్నట్లు కూల్ డ్రింక్(Cool Drink Botile) బాటిల్లో మద్యం పోసుకొని డ్రింక్ లా తాగే రవి చందర్(Ravi Chender) జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District) రాజోలి మండలం చిన్న ధన్వాడ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా గత 5 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నాడు.
పేరుకే విధులు.. నిత్యం మత్తులోనే
ఉపాధ్యాయుడు రవి చందర్ పాఠశాలకు కేవలం పేరుకే విధులు నిర్వహిస్తూ నిత్యం మద్యం మత్తులో తూగుతూ విద్యార్థులను దుర్భసలాడుతూ విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా మద్యం సేవించి పాఠశాలలోని ఓ గదిలో డోర్ పెట్టుకొని షర్ట్ విప్పి మత్తులో తూలుతూ నిద్రపోయేవాడని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
పాఠశాలలో తగ్గిన విద్యార్థులు
పెద్ద ధన్వాడ గ్రామ అప్పర్ ప్రైమరీ స్కూల్(Primary School)గా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడి తీరుతో 200 మంది విద్యార్థుల నుంచి 50 విద్యార్థులకు పరిమితమైంది. పాఠశాలలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా విద్యార్థుల భవిష్యత్తుపై కలత చెందిన తల్లిదండ్రులు సమీపంలోని శాంతినగర్ లోని ప్రైవేట్ పాఠశాలలో వ్యయ ప్రయాసాల కోర్చి చదివించాల్సిన పరిస్థితి దాపురించింది. పలుమార్లు పద్ధతి మార్చుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, సంబంధిత ఎంఈఓ(MEO) సూచించినా పెడచెవిన పెట్టి వారినే తిరిగి దూషించేవాడు. పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేపట్టిన అడిషనల్ కలెక్టర్ పాఠశాలకు ఉపాధ్యాయుడు రవి చందర్ గైర్హాజరైన విధులకు హాజరైనట్లు సంతకం ఉండడంతో సస్పెండ్ చేశాడు.
Also Read: Elumalai: సింగర్ మంగ్లీ అలా అడుగుతుంటే.. కాపాడకుండా ఉంటాడా!
అడిషనల్ కలెక్టర్ కె 30 వేలు లంచమిచ్చా
తాను తిరిగి విధుల్లో చేరేందుకు ఓ అడిషనల్ కలెక్టర్ కి 30 వేలు లంచం ఇచ్చానని, నాకు ఇది మామూలేనని ఎవరు ఏం చేయలేరని ప్రశ్నించే వారిపై ఆ ఉపాధ్యాయుడు విరుచుకుపడేవాడు. ఇప్పుడు సస్పెండ్ అయిన కలెక్టర్ కు లంచమిచ్చి మళ్లీ విధుల్లో చేరుతానని విద్యార్థి తండ్రితో మాట్లాడుతున్న ప్రస్తుత వీడియో సోషల్ మీడియా(Social Media)లో హల్చల్ అవుతోంది. విద్యార్థులను అసభ్య పదజాలంతో దూషించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహించి ఎంఈఓ కి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో చిన్న ధన్వాడ ప్రభుత్వ పాఠశాలను ఎంఈఓ భగీరథ రెడ్డి(MEO Bhagiratha Reddy) తనిఖీకి రాగా వాటర్ ట్యాంక్ పక్కల ఉన్న ఇంకుడు గుంతలో ఫూటుగా తాగి మత్తులో నిద్రపోతున్నాడు.
సస్పెండైన సగం జీతం వస్తుందిలే
పాఠశాలకు మద్యం సేవించి రావడం ప్రభుత్వ నియమాలకు విరుద్ధమని ఎంఈఓ సూచించాడు. విద్యార్థులతో పాఠాలు చదివించాలని నిద్రిస్తున్న ఉపాధ్యాయుడుని పాఠశాల గదిలోకి తీసుకురాగా మత్తులో తూలుతూ ఇబ్బంది పడ్డాడు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్లుగా మీరు ప్రతిరోజు మద్యం సేవిస్తున్నారని మీపై సస్పెన్షన్ గురి తప్పదని ఎంఈఓ అనగా ఇది నాకు మామూలేనని జీతంలో సగమైన వస్తుంది కదా అని ఆ ఉపాధ్యాయుడు ధీమాగా బదులిచ్చాడు. పాఠశాలలో చదివే విద్యార్థులు వారిని తల్లిదండ్రులతో ఉపాధ్యాయుడు తీరుపై వివరాలను సేకరించి సమగ్ర నివేదికను ఎంఈఓ(MEO) ఉన్నతాధికారులకు సమర్పించాడు.
సస్పెన్షన్ కు కలెక్టర్ ఆదేశాలు
రాజోలి మండలంలోని చిన్నధన్వాడ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న పి. రవిచందర్(P Ravi chender)ను జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్(BM Santhosh) సస్పెండ్ ఉత్తర్వులు బుధవారం జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం, పాఠశాల సమయాల్లో మద్యం సేవించడం, విద్యార్థులపై దురుసుగా ప్రవర్తించడం వంటి తీవ్రమైన ఆరోపణలు నిర్ధారణ కావడంతో సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు పిల్లలకు విద్యతో పాటు మంచి విలువలను నేర్పించాల్సిన వారే నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల అసహనం వ్యక్తపరిచారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో అత్యంత కీలక బాధ్యత ఉపాధ్యాయులదేనని, అలాంటి వారు విధుల్లో నిర్లక్ష్యం, పాఠశాలలో మద్యం సేవించడం విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించడం వంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉపాధ్యాయులు తన వృత్తి పట్ల అంకితభావంతో పనిచేసి విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు నేర్పించి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే విధంగా తమ విధులను నిర్వర్తించాలని ఆకాంక్షించారు.
Also Read: Viral Video: ఏనుగుతో చెలగాటం.. చావు అంచుల వరకూ వెళ్లిన వ్యక్తి.. ఎలాగో మీరే చూడండి!