Elumalai: మంగ్లీ అలా అడుగుతుంటే.. కాపాడకుండా ఉంటాడా!
Elumalai Still
ఎంటర్‌టైన్‌మెంట్

Elumalai: సింగర్ మంగ్లీ అలా అడుగుతుంటే.. కాపాడకుండా ఉంటాడా!

Elumalai: హీరోయిన్ రక్షిత (Rakshita) సోదరుడు రాన్నా (Raanna) హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. ఒకప్పుడు కుర్రాళ్లను ఓ ఊపు ఊపేసిన రక్షిత ఇప్పుడు నిర్మాతగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడామె సోదరుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతున్నారు. రాన్నా హీరోగా ప్రియాంక ఆచార్ హీరోయిన్‌గా… జగపతి బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఏలుమలై’ (Elumalai). తరుణ్ కిషోర్ సుధీర్ నిర్మాణంలో పునీత్ రంగస్వామి తెరకెక్కిస్తున్నారు. నరసింహా నాయక్ (రాజు గౌడ) సమర్పణలో తరుణ్ సుధీర్ క్రియేటివ్స్, డీఈ ఆర్ట్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం యథార్థ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకి రచన, మాటలు, దర్శకత్వం పునీత్ రంగస్వామి. ఇప్పటి వరకు ‘ఏలుమలై’ నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచేయగా.. తాజాగా ఈ చిత్రం నుంచి గుండెల్ని పిండేసే, మనసుల్ని కదిలించే ప్రేమ పాటను మేకర్స్ విడుదల చేశారు.

Also Read- Sai Durgha Tej: సాయి దుర్గ తేజ్‌కు ‘మోస్ట్ డిజైరబుల్’ అవార్డ్.. ఎవరికి అంకితం ఇచ్చారంటే?

‘‘కాపాడు.. దేవా.. కాపాడు..
కాపాడు.. కాపాడు.. ప్రేమికుల చేతులిలా విడిపించకు
కాపాడు దేవా.. కాపాడు.. ప్రేమనిలా ఒంటరిగా విడిచెళ్లకు..
పిచ్చి మనసు.. అద్దమని తెలుసు
ఒకరికొకరు ఉండాలనే బాస..
ఉంది ప్రాణం.. నువ్వు ఇస్తే దానం..
ఎవరికెవరు అయ్యారంటే మౌనం
నిన్నే చేరి మొక్కే పూజలు ఎట్లగనో..
ప్రేమికుడు పంచె ప్రేమ అట్లా కాదా..
కాదని నువ్వనగలవా..’’ అంటూ సింగర్ మంగ్లీ (Singer Mangli) ఆలపించిన ఈ పాట ఎంతో హృద్యంగా ఉంది. విన్నవెంటనే శ్రోతల మనసుల్ని కదిలించేలా ఉంది. నేషనల్ అవార్డ్ విన్నర్ కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటకు డి. ఇమ్మాన్ బాణీలు సమకూర్చారు. ఈ పాటను కంపోజ్ చేసిన తీరు, లిరిక్స్‌ను గమనిస్తే.. ఓ ప్రేమ జంట, విడిపోయే క్షణాలను వర్ణిస్తూ.. ఆ దేవుడు ఆడే ఆటని తెలుపుతున్నట్లుగా ఉంది. ఇప్పటికే సిధ్ శ్రీరామ్ ఆలపించిన ‘రా చిలకా’ అనే పాట యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతుండగా.. ఈ పాట కూడా చార్ట్ బస్టర్ లిస్ట్‌లో చేరుతుందని మేకర్స్ ఆశిస్తున్నారు.

Elumalai Song Launch

Also Read- Indian Railways: సొంతూర్లకు వెళ్లే వారికి.. రైల్వేశాఖ బంపరాఫర్.. టికెట్లపై భారీ డిస్కౌంట్ ప్రకటన!

నాగభరణ, కిషోర్ కుమార్, సర్దార్ సత్య, జగప్ప తదితరులు ఇతర పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాను కర్ణాటక-తమిళనాడు సరిహద్దులోని చామరాజనగర్, సేలం, ఈరోడ్ వంటి వివిధ ప్రదేశాలలో చిత్రీకరించారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, కన్నడ భాషలలో ఏకకాలంలో విడుదల కానుందని, త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నామని మేకర్స్ ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రస్తుతం ఈ పాట టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా బ్రహ్మాండమైన విజయాన్ని అందుకుంటుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

New Year Party: న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్.. నగరానికి చేరుస్తున్న పెడ్లర్లు డెడ్​ డ్రాప్​ పద్దతిలో..!

Nagababu Politics: అక్కడ ఫోకస్ పెట్టేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఫోకస్ తగ్గించుకుంటున్న మెగా బ్రదర్..

BiggBoss9 Prize Money: బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్‌కు వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.. సర్‌ప్రైజ్ గెస్ట్ ఎవరంటే?

Kerala News: కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా.. పంచాయతీ ఎన్నికల్లో యూటీఎఫ్ సత్తా

Brown University: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి, ఎనిమిది మంది పరిస్థితి విషమం