Swetcha Effect (imagecredit:swetcha)
తెలంగాణ, సూపర్ ఎక్స్‌క్లూజివ్

Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్‌తో.. విస్తృత తనిఖీలు చేపడుతున్న ఆర్టీఏ అధికారులు

Swetcha Effect: రవాణా శాఖ అధికారుల తీరుపై ‘స్వేచ్ఛ’ రాస్తున్న కథనాలకు స్పందించారు. ఈ నెల 4న ఓవర్ లోడ్ నియంత్రణ బాధ్యత ఎవరిది?.. అనే కథనాన్ని ప్రచురించింది. చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనతో తనిఖీలు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, సిబ్బందికి సైతం డ్యూటీలు సరిగ్గా చేయడం లేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. కమర్షియల్ వాహనాలు పరిమితికి మించి రవాణా చేయవద్దనే నిబంధనలు ఉన్నా.. ఆ వాహనాలను నిత్యం మానిటరింగ్ చేయాల్సిన రవాణా శాఖ అధికారులు ప్రతి రోజూ తనిఖీలు చేయడం లేదని తేలింది. కానీ వారి ఉదాసీనత కారణంగానే కమర్షియల్(Commercial), మైన్స్ మినరల్స్(Mines Minerals) తరలించే వాహనాలు నిబంధనలు పాటించడం లేదని బయటపడింది.


జీరో బిల్లులతో ఓవర్ లోడ్..

దీంతో తనిఖీ చేయాల్సిన అధికారులు కేవలం కార్యాలయాలకే పరిమితం అవుతున్నారని, రాష్ట్రంలో ఏదైనా ఘటన జరిగితేనే స్పందిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. దీనికి తోడు మైనింగ్ వ్యాపారులు(క్రషర్ మిషన్ వ్యాపారులు) నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వే బిల్లులు లేకుండా అంటే మైనింగ్ రాయల్టీ చెల్లించకుండా జీరో బిల్లులతో ఓవర్ లోడ్ వేస్తున్నాయని, టిప్పర్లు, లారీలు ఓవర్ లోడ్(Over Load), ఓవర్ స్పీడ్(Over Speed) కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులే పేర్కొంటున్నారు. వాటిపై చర్యలు తీసుకోకుండా కొంతమంది చేతివాటం ప్రదర్శిస్తున్నారని ‘స్వేచ్ఛ’ కథనం ప్రచురించడంతో రవాణాశాఖ అధికారులు స్పందించారు.

Also Read: Telangana Road Accidents: రోడ్డు ప్రమాదాల నియంత్రణలో చర్యలు శూన్యం.. సిబ్బంది ఉన్నా బృందాలు ఏర్పాటు చేయడంలో విఫలం


తనిఖీల్లో భాగంగా..

బుధవారం రంగంలోకి దిగి ఓవర్ లోడ్‌తో వెళ్తున్న వాహనాలను పట్టుకున్నారు. గ్రేటర్‌లో మూడు టిప్పర్లను పట్టుకొని సీజ్ చేసినట్లు జేటీసీ రమేశ్(JTC Ramesh) తెలిపారు. ఇసుక(Sand), బ్రిక్స్(Brics), మెటల్(Metal) తరలిస్తున్న టిప్పర్లు నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి తరలిస్తుండగా తనిఖీల్లో భాగంగా నాగోల్‌లో ట్రాన్స్‌పోర్టు అధికారులు పట్టుకుని సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ఓవర్ లోడ్ తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Also Read: Deputy CM: వరల్డ్ క్లాస్ ఫిలిం సిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం.. ‘మా’ బిల్డింగ్‌కు స్థలం కూడా మేమే ఇస్తాం!

Just In

01

Ranglal Kunta Lake: రంగలాల్‌కుంట పునరుద్ధరణకు చర్యలు సిద్దం.. రంగంలోకి బ్లూడ్రాప్ ఎన్విరో సంస్ధ

Airtel 5G: ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. తక్కువ ధరలో 5G స్పీడ్‌తో కొత్త ప్లాన్ విడుదల

Anunay Sood death: లాస్ వేగాస్‌లో ప్రముఖ ట్రావెల్ ఇన్‌ఫ్లూయెన్సర్ మృతి..

Private Colleges: సర్కార్‌కు ప్రైవేట్ కాలేజీల హెచ్చరిక.. డబ్బు చెల్లించాలని డిమాండ్.. లేదంటే..?

AUS vs IND 4th T20I: కాసేపట్లో భారత్-ఆసీస్ నాల్గో టీ20.. ఇరు జట్లలో కీలక మార్పులు.. ఎవరు గెలుస్తారంటే?