Deputy CM Mallu Bhatti Vikramarka (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Deputy CM: వరల్డ్ క్లాస్ ఫిలిం సిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం.. ‘మా’ బిల్డింగ్‌కు స్థలం కూడా మేమే ఇస్తాం!

Deputy CM: వరల్డ్ క్లాసు ఫిలిం సిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలంగాణ డిప్యూటీ సీఎం (Deputy Chief Minister of Telangana) భట్టి విక్రమార్క మల్లు (Mallu Bhatti Vikramarka) అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkata Reddy)‌తో కలిసి తెలుగు ఫిల్మ్ క్లబ్‌లో సినీ రంగ ప్రముఖులు, సినీ రంగ కార్మిక నాయకుల సమావేశంలో ప్రసంగించారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు కానీ.. నాడు ఉమ్మడి రాష్ట్రంలో, అలాగే నేడు ప్రత్యేక రాష్ట్రంలో సినీ పరిశ్రమకు ఏదైనా మేలు జరిగింది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..

Also Read- Fauzi: ప్రభాస్ ‘ఫౌజి’లో తనయుడు.. కన్ఫర్మ్ చేసిన హీరో సుధీర్ బాబు!

రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది

వేలాదిమంది సినీ కార్మికుల జీవితాలను మెరుగుపరచడానికి, చెన్నైలో ఉన్న సినీ పరిశ్రమను హైదరాబాద్ రప్పించడానికి, సినీ స్టూడియోలు నిర్మించేందుకు ప్రభుత్వమే భూములు ఇచ్చిందని వివరించారు. ఒక అన్నపూర్ణ, పద్మాలయ, రామానాయుడు తదితర సినీ స్టూడియోలు అన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే ప్రారంభం అయ్యాయని వివరించారు. ఫిలిం క్లబ్‌కు స్థలం సైతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఇవ్వడం జరిగిందని అన్నారు. సినీ కార్మికుల కోసం సీనియర్ నటుడు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చిత్రపురి కాలనీ ఏర్పాటు కోసం దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అడిగి మరీ ఏర్పాటు చేయించారని గుర్తు చేశారు. సినీ పరిశ్రమకు ఏ సమస్య వచ్చినా, ఎలాంటి వినతి వచ్చినా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

Also Read- Monalisa Bhosle: తెలుగు సినిమాలో హీరోయిన్‌గా కుంభమేళా మోనాలిసా.. మూవీ ప్రారంభం.. వివరాలివే!

ఈ ప్రభుత్వం బలంగా ఉంటేనే..

హైదరాబాద్ గొప్పనగరం.. అన్ని భాషల వారిని అక్కున చేర్చుకుంటుంది. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, చక్కటి వాతావరణం, తక్కువ ధరకే మానవ వనరుల లభ్యత వంటి వన్నీ హైదరాబాద్‌కే సొంతం అన్నారు. సినీ పరిశ్రమ కోసం కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రతి సందర్భంలోనూ నిలబడ్డాయని, భవిష్యత్తులోనూ నిలబడతాయని తెలిపారు. సినీ పరిశ్రమ బాగా ఎదగాలి.. ఎంత ఎదిగితే అంతమందికి ఉపాధి, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. సినీ పరిశ్రమ ఈ రాష్ట్రంలో ఎదగాలంటే ఈ ప్రభుత్వం బలంగా ఉండాలి, ఈ ప్రభుత్వం బలంగా ఉంటేనే సినీ పరిశ్రమ బాగా ఎదుగుతుందని పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని అన్నారు. మా అసోసియేషన్ కార్యాలయం నిర్మాణానికి స్థలం విషయంలో ఎఫ్‌డిసి చైర్మన్‌తో మాట్లాడి.. ఆ కల సాకారం అయ్యేలా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని తెలిపారు. భవిష్యత్తులో మంచి సినిమాలు రావాలి. అలాగే, చిన్న సినిమాలు కూడా రావాలి, నిలబడాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎఫ్‌డిసి చైర్మన్‌ దిల్ రాజు (Dil Raju)‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Tollywood: ప్రచారంలో అలా మాట్లాడటం ఎందుకు? ఆ తర్వాత ఫూల్స్ అవడమెందుకు?

Bandla Ganesh: బండ్ల గణేష్ మాటల వెనుకున్న మర్మమేంటి? ఎందుకిలా మాట్లాడుతున్నాడు?

Deputy CM: వరల్డ్ క్లాస్ ఫిలిం సిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం.. ‘మా’ బిల్డింగ్‌కు స్థలం కూడా మేమే ఇస్తాం!

CM Revanth Reddy: షేక్‌పేట డివిజన్ రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్..!

Roja: 90స్ క్వీన్ రీ ఎంట్రీ.. 12 ఏళ్ల తర్వాత ‘సంతానం’గా రోజా!