Kishan Reddy: కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించి తలపెట్టిన గోదావరి – బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఇరువురు చర్చించారు. ఈ లింకు ప్రాజెక్టును మంత్రిత్వశాఖ నిబంధనలకు అనుగుణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని పాటిల్ తెలియజేశారు. అన్ని భాగస్వామ్య పక్షాలతో చర్చించిన తర్వాత పారదర్శకమైన పద్ధతిలోనే ప్రాజెక్టుకు సంబంధించిన నిర్ణయం ఉంటుందన్నారు. ఈ విషయంలో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కిషన్ రెడ్డికి సీఆర్ పాటిల్ భరోసా ఇచ్చారు.
Also Read: Ye Maaya Chesave : నాగ చైతన్యతో కలిసి సమంత మూవీ ప్రమోషన్స్? ఫ్యాన్స్ కోరిక నెరవేరుతోందా?
ఖట్టర్‌తోనూ భేటీ
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తోనూ కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల స్థితి గురించి చర్చించారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పనులకు కేంద్ర ప్రభుత్వ సహకారం అంశంపై చర్చ జరిగింది. మెట్రో ఫేజ్ 2 కోసం తెలంగాణ ప్రభుత్వం పంపించిన డీపీఆర్ ఇటీవలే అందిందని ఖట్టర్ తెలిపారు. ఈ డీపీఆర్‌ను మంత్రిత్వశాఖ అధికారులు పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డీపీఆర్‌లో కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని ఈ డీపీఆర్ రూపొందించి ఉంటారని ఖట్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నిరంతరం సహకారం అందిస్తుందని ఆయన వెల్లడించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు