Ye Maaya Chesave : సమంత, నాగ చైతన్య ప్రేమ పెళ్లి చేసుకుని, విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, వీళ్ళు విడిపోయిన తర్వాత ఎన్నో సందేహాలు? ఎన్నో ప్రశ్నలు? ఇప్పటికీ కూడా వీళ్ళు ఎందుకు విడిపోయారో సరైన కారణం ఇంత వరకు బయటకు రాలేదు. వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. వాళ్ళు ప్రేమించుకునేటప్పుడు నాలుగు సినిమాలు కలిసి చేశారు. నిజం చెప్పాలంటే నాగ చైతన్యకి సమంత హిట్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. మజిలీ మూవీ ఇద్దరి కెరియర్లో గుర్తుండి పోతుంది. అయితే, వీరిద్దరూ ఎందుకు విడిపోయారో ఇండస్ట్రీ పెద్దలకు తెలుసని అంటున్నారు. అయితే, ఎవ్వరూ ఊహించని విధంగా ఈ జంట విడిపోయి అందరికీ బిగ్ షాక్ ఇచ్చారు. అయితే, తాజాగా వీరికి సంబందించిన ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. అదేంటో ఇక్కడ ఇక్కడ తెలుసుకుందాం ..
Also Read: Ye Maaya Chesave : నాగ చైతన్యతో కలిసి సమంత మూవీ ప్రమోషన్స్? ఫ్యాన్స్ కోరిక నెరవేరుతోందా?
నాగచైతన్య, సమంత కలిసి జంటగా నటించిన ‘ఏ మాయ చేసావే’ త్వరలో రీ-రిలీజ్ కానుంది. 2010లో రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది. అయితే, ఇప్పుడు ఈ చిత్రాన్ని జూలై 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే, ఇటీవల ఈ రీ-రిలీజ్‌కి సంబంధించిన ప్రమోషన్స్ సామ్ , చైతూ తో కలిసి చేయాలనీ మూవీ టీం ప్లాన్ చేస్తుంది.
వీటిపై రియాక్ట్ అయిన సమంత, “ దీనిలో ఎలాంటి నిజం లేదు. నేను ఆ చిత్రాన్ని ప్రమోట్ చేయడం లేదు. ఇలాంటివి ఎందుకు పుట్టిస్తున్నారో అర్ధం కావడం లేదు. ఎక్కడినుంచి వస్తున్నాయో అర్థం కావడం లేదు” అంటూ ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత క్లారిటీ ఇచ్చింది. అలాగే తనకు సంబందం లేని వాటిలో తనని లాగొద్దని చెప్పింది.