Genelia Marriage: జెనీలియా 14 ఏళ్ల క్రితమే రితేష్ ను కాకుండా ఒక హీరోను పెళ్లి చేసుకుందని ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. అంతే కాకుండా, దీనికి సంబందించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కెర కొడుతోంది. మరి, ఫోటోలో ఉన్నది ఎంత వరకు నిజంగా ఉందని ఇప్పుడు చూడబోతున్నాం. 2011 లో వచ్చిన ఫోర్స్ చిత్రంలో హీరోయిన్ జెనీలియా, హీరో జాన్ అబ్రహం ఇద్దరు నటించారు.
ఈ మూవీలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఏ లెవెల్ లో ఉందో మనందరికీ తెలిసిందే. నిజం చెప్పాలంటే ఈ మూవీలో పెద్దల సీన్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రతీ సీన్ లో రెచ్చిపోయి మరి నటించారు. అయితే ఈ చిత్రంలో జెనీలియా, జాన్ అబ్రహం పెళ్లి పీటలెక్కి.. వివాహం చేసుకునే సీన్ కూడా ఉంది. అయితే, ఈ సీన్ లో నార్మల్ గా కాకుండా నిజంగానే పెళ్లి చేసుకున్నారని అప్పట్లోనే ఈ వార్త బాగా వైరల్ అయింది. షూటింగ్లో భాగంగా వివాహం చేయమంటే పంతులు గారు నిజంగానే మూడు ముళ్ళు వేపించారని చెబుతున్నారు.
ఈ రూమర్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ట్రెండింగ్ లోనే ఉంది. ఇంత వరకు దీని పై ఎవరూ స్పందించకపోయినప్పటికీ నిజమే అని అనుకున్నారు. అయితే, జెనీలియా ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో దీనిపైన స్పందించింది.
” 14 ఏళ్ల నుంచి ఈ రూమర్ నేను కూడా వింటూనే ఉన్నాను. వాస్తవానికి నాకు జాన్ అబ్రహం తో పెళ్లి కాలేదు. అతనితో పెళ్లి కాలేదని నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. అది మూవీలోని ఒక సీన్ మాత్రమే. కొంతమంది పిఆర్ లు కలిసి అతనికి, నాకు నిజంగానే పెళ్లి చేసేశారు. పంతులు గారు కూడా వచ్చారంటూ అంటూ రూమర్ స్ప్రెడ్ చేశారు. దీనిలో ఎలాంటి నిజం లేదని ఆమె మాటల్లో చెప్పుకొచ్చింది ” . అలాగే, ఈ వార్తను కూడా కొట్టి పారేసింది.