Ashu Reddy ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Ashu Reddy: లైవ్ లో అషు రెడ్డిని అక్కడ టచ్ చేసి ముద్దు పెట్టిన కమెడియన్.. రిలేషన్షిప్ నిజమే అంటూ కామెంట్స్

Ashu Reddy: బుల్లితెర ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి టీవీ షోలు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటాయి. వీటితోనే చాలా మందికి టైమ్ పాస్ అవుతోంది. ఇవి మాత్రమే కాకుండా జనాలు ఓటీటీలకు కూడా అలవాటు పడ్డారు. ఇక ప్రముఖ ఓటీటీ సంస్థలు కూడా కొత్త షో లను ప్రజల ముందుకు తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే టాక్ షోలు కూడా హిట్ అవుతున్నాయి. సెలబ్రిటీలు రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు? ఎన్ని కష్టాలు పడ్డారు? వారి నోటి నుంచే చెప్పించే టాక్ షోలకు ప్రాధాన్యత పెరుగుతుంది. అయితే, ప్రస్తుతం ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ‘కాకమ్మ కథలు సీజన్ 2’ అనే టాక్ షో మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తుంది. ఈ షో కి తేజస్వి మదివాడ యాంకర్ గా చేస్తోంది. అయితే, తాజాగా కొత్త ఎపిసోడ్ కు సంబందించిన ఓ వీడియోను విడుదల చేశారు.

‘కాకమ్మ కథలు సీజన్ 2’ కొత్త ఎపిసోడ్ 

అయితే, తాజాగా రిలీజ్ చేసిన ఎపిసోడ్ కు బిగ్ బాస్ అషు రెడ్డి, పటాస్ ఎక్స్ ప్రెస్ హరి వచ్చి సందడీ చేశారు. కామెడిలో ఆయనకు సాటి లేదు.. ఆడియెన్స్ ఐ యామ్ రియల్లీ వెరీ సారి .. లెట్స్ వెల్కమ్ హరి అంటూ తేజస్వి మదివాడ ఇన్వైట్ చేసింది. ఎంత కాకమ్మ కథలైతే మాత్రం కాకికి మ్యాచింగ్ వేసుకొస్తావా అని రాగానే యాంకర్ మీద హరి గట్టి కౌంటర్ వేశాడు. వీడిని ఆపాలంటే ఇంకొక అమ్మాయి రావాల్సిందే.. అంటూ అషు రెడ్డి ఇన్వైట్ చేసింది.

 అషు రెడ్డి, ఎక్స్ ప్రెస్ హరి ఎఫైర్ నిజమేనా? 

నువ్వు చిన్నప్పటి నుంచి రాజును పెంచుకున్నావ్.. మరి, వీడిని ఎందుకు పెంచుకున్నావ్ అని అషు రెడ్డిని తేజస్వి అడిగింది. అప్పుడు, ఆమె పెంచుకోకపోతే ఉంచుకోమంటారేమో అని ఫన్నీగా చెప్పింది. అషు నా పక్కన ఉన్నా చాలు , అదే నాకు వెయ్యి .. ప్రేమించాల్సిన అవసరం లేదని హరి ఒక డైలాగ్ వేస్తాడు. నీకేమైన ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తా అన్నారా ఇలా చెబుతున్నావ్ అని అషు రివర్స్ కౌంటర్ వేసింది. అయితే, పుష్ప సినిమాలో అల్లు అర్జున్ రష్మికకి కాలు మీద ఎలా అయితే ముద్దు పెట్టాడో .. అదే విధంగా హరి కూడా ఆమె కాలును పట్టుకుని తగ్గేదే లే అనే డైలాగ్ చెబుతూ ముద్దు పెట్టాడు. దీనికి సంబందించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ