Suniel Narang: శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర మూవీలో హీరో ధనుష్, సీనియర్ హీరో నాగార్జున కలిసి నటించారు. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందాన హీరోయిన్ గా నటించింది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 20 న రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన సునీల్ నారంగ్ ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో సంచలన కామెంట్స్ చేశాడు.
దేవి పాటలు ఇచ్చారా? అని జర్నలిస్ట్ కుబేర నిర్మాతను అడగగా.. హ ఇచ్చారు. అన్నీ రిలీజ్ చేశామని చెప్పాడు. కొంచం లేట్ అయినట్టు అనిపించడం లేదా అని అడగగా .. మనం దేవినీ అనకూడదు. మరి ఆయనకు, డైరెక్టర్ కు ఎలాంటి సంబందం ఉందో వారికే తెలియాలని అన్నాడు. ఇంకా కొన్ని ప్రశ్నలు అడగ్గా .. ఆయన ఎలాంటి జవాబులు చెప్పాడో మీరు కూడా చదివి తెలుసుకోండి.
Also Read: Suniel Narang: సినిమాలే చూడను.. వారి ముందు నేను ఎంత?.. కుబేర నిర్మాత సంచలన కామెంట్స్
మూడేళ్ళ క్రితం సినిమా ఇంత వరకు రిలీజ్ కాలేదు?
సినిమా అనౌన్స్ చేసింది మూడేళ్ళ క్రితం. కానీ, సినిమా మొదలు పెట్టింది మాత్రం 2023 లో. మా నాన్న గారు ఉన్నప్పుడు సినిమా గురించి అందరికీ చెప్పామని సునీల్ నారంగ్ చెప్పాడు.
Also Read: Suniel Narang: సినిమాలే చూడను.. వారి ముందు నేను ఎంత?.. కుబేర నిర్మాత సంచలన కామెంట్స్
సినిమా ఎందుకు లేట్ అయింది?
నేను కొన్ని మాట్లాడకూడదు. అంటే కొన్ని ఎవరికీ చెప్పుకోలేము. మీరు కూడా నన్ను అడగకండి. మీరు కొన్ని ప్రశ్నలకి నో రిప్లై అని జర్నలిస్ట్ మొఖం మీదే కుబేర నిర్మాత చెప్పాడు.
సినిమా కథ విన్నారా?
నేను సినిమాలనే చూడను. మీకు తెలియదా ? మీరు నన్ను ఎన్నేళ్ళ నుంచి చూస్తున్నారు. నేను కొన్ని పార్ట్స్ మాత్రమే చూస్తాను. అంతే. ప్రత్యేకంగా కూర్చొని ఏ సినిమా చూడను అని సునీల్ నారంగ్ చెప్పాడు.
అయితే, మీకు జడ్జ్మెంట్ ఎలా తెలుస్తుంది?
నేను చూడను, మా పాప చూస్తుంది. నాకు జడ్జ్మెంట్ లేదు. నాకు అనుభవమే లేదు. నేను సినిమాలు చూడకుండా రిజల్ట్ ఎలా చెప్పగలను. వారి ముందు నేను ఎంత .. నేను చూసినా .. చూడకపోయినా ఏం కాదంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.