AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అంబర్ పేటలోని బతుకమ్మకుంటను సందర్శించారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో బతుకమ్మ కుంట చుట్టూ వాకర్లతో కలిసి నడిచారు. బతుకమ్మ కుంట అభివృద్ధి పట్ల వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఎంత మంది వాకింగ్ కు వస్తున్నారు? వారికి బతుకమ్మ కుంట ఎలా ఉపయోగపడుతోంది? ఈ పరిసర ప్రాంత ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. బతుకమ్మ కుంట ఇప్పుడు మాకందరికీ విహార కేంద్రమైందని స్థానికులు కమిషనర్ కు చెప్పారు. బతుకమ్మ కుంట అందుబాటులో రావడంతో ఈ పరిసర ప్రాంతాల రూపురేఖలే మారిపోయాయని, వాకింగ్ చేసుకుంటూ ఆరోగ్యాలు కాపాడుకుంటున్నామని స్థానికులు వ్యాఖ్యానించారు.
Also Read: AV Ranganath: పూడికతీత పనులు ఆపొద్దు.. కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించిన విద్యార్థినులు!
హైడ్రాకు ధ్యాంక్స్
ఒకప్పుడు దుర్గంధంతో వ్యాధులు భారిన పడేవాళ్ళమని ఇప్పుడు ఆరోగ్యాలు కాపాడుకుంటున్నామని, పిల్లలకు మంచి క్రీడా స్థలంగా మారిందని చెప్పారు. ఈ చెరువును సెప్టెంబర్ 28న ప్రారంభించామని, చెరువు చుట్టూ వేసిన మొక్కలు పెద్దవైతే మరింత ఆరోగ్యవంతంగా పరిసరాలు మారుతాయని కమిషనర్ రంగనాధ్ వారితో వ్యాఖ్యానించారు. చెరువును ఇంతే శుభ్రంగా కాపాడుకోడానికి హైడ్రాతో కలసి పని చేయాలని అక్కడి వాకర్లను కమిషనర్ కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ వాకర్లు సెల్ఫీ ఫోటోలు దిగారు. పలువురు చిన్నారులు బతుకమ్మ కుంట సూపర్, అంటూ హైడ్రాకు ధ్యాంక్స్ అంటూ వ్యాఖ్యానించారు.
Also Read: AV Ranganath Hydraa: నాలాల్లో నీటి ప్రవాహానికి ఆటంకాలుండొద్దు.. హైడ్రా కమిషనర్ సుడిగాలి పర్యటన
