Jubilee Hills Bypoll Results: తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ మెుదలైంది. సరిగ్గా 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. నియోజకవర్గంలోని యూసఫ్ గూడాలో గల కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈనెల 12న జరిగిన ఉపఎన్నికల పోలింగ్ లో మెుత్తం లక్షా 94 వేల మొత్తం లక్షా 94 వేల 631 (48.49 శాతం) ఓట్లు పోల్ అవ్వగా వాటిని 42 టేబుల్స్ లలో 10 రౌండ్లుగా లెక్కించనున్నారు. రౌండ్ల వారీగా ఫలితాలను వెల్లడించనున్నారు. అయితే జూబ్లీహిల్స్ కౌంటింగ్ ప్రారంభానికి ముందు ఓ విషాదం చోటుచేసుకుంది.
అభ్యర్థి అకస్మిక మృతి
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల కౌంటింగ్ జరుగుతున్న వేళ.. కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన నేషనల్ కాంగ్రెస్ పార్టీ (NCP) అభ్యర్థి మహ్మద్ అన్వర్ అకస్మాత్తుగా మృతి చెందారు. గురువారం రాత్రి గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎర్రగడ్డలో నివాసం ఉండే అన్వర్.. అక్టోబర్ 22న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల కోసం నామినేషన్ వేశారు. దానిని ఈసీ పరిశీలించి ఓకే చేయడంతో.. బరిలో నిలిచారు. అయితే ఫలితాలకు ఒకరోజు ముందు అన్వర్ మృతి చెందడంతో ఆయన అనుచరులు, కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అభ్యర్థి మృతి!
ఉప ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థి మహ్మద్ అన్వర్ గుండెపోటుతో మృతి
ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థి మృతితో నెలకొన్న విషాదం pic.twitter.com/n7EMiulrMi
— BIG TV Breaking News (@bigtvtelugu) November 14, 2025
తొలుత పోస్టల్ బ్యాలెట్లు
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మెుత్తం పోలింగ్ స్టేషన్లు 407 ఉండగా ఫస్ట్ పోలింగ్ స్టేషన్ నెంబర్ – 1 నుంచి ఓట్ల కౌటింగ్ ప్రారంభం కానుంది పోలింగ్ స్టేషన్ 1 నుంచి 42 వరకూ ఉన్న ఈవీఎంలను తొలి రౌండ్ లో తెరిచి లెక్కిస్తారు. ఆ తర్వాత 43-85 పోలింగ్ స్టేషన్లలో పోలైన ఓట్లను కౌంట్ చేస్తారు. ఇలా మెుత్తం 407 పోలింగ్ స్టేషన్లలో నమోదైన ఓట్లను 10 రౌండ్లలో లెక్కించి.. ప్రతీ రౌండ్ ఫలితాలను ఈసీ వెల్లడించింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను ఎన్నికల సిబ్బంది లెక్కించనుంది.
3 గంటల కల్లా ఫలితం..
ఓట్లను లెక్కించే సమయంలోని చెల్లని ఓట్లను కూడా అభ్యర్థులకు, కౌంటింగ్ ఏజెంట్లకు చూపి పక్కన పెట్టనున్నారు. మధ్యాహ్నం 3 గంటల కల్లా 10 రౌండ్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేసి ఫలితాన్ని వెల్లడించనున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన అభ్యర్థుల మధ్యనే ప్రధాన పోటీ ఉండే అవకాశముందని రాజకీయ నిపుణలు చెబుతుండగా, అసలైన పోటీ అధికార, విపక్షాలైన కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్యనే ఉండవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్ రోజు అమలు చేసిన వంద మీటర్ల ఆంక్షను, శుక్రవారం కౌంటింగ్ జరగనున్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి సెంటర్ ఆవరణలో కూడా అమల్లో ఉండనుంది.
Also Read: Jubilee Hills Counting: జూబ్లీహిల్స్ కౌంటింగ్ వేళ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు
మెజార్టీ స్వల్పమే
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో గెలుపు ఏ అభ్యర్థిని వరించినా అది స్వల్ప మెజార్టీతోనే అన్న అంచనాలున్నాయి. గత 2023 సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి మొత్తం 19 మంది అభ్యర్థులు, నోటా పోటీలో ఉండగా, మొత్తం 47.58 శాతం ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ అజారుద్దిన్ పై 16 వేల 337 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఈ నెల 11న జరిగిన ఉప ఎన్నికలో కూడా అధికారులు ఆశించిన స్థాయిలో పోలింగ్ శాతం నమోదు కాలేదు. గతంలో కన్నా స్వల్పంగా పోలింగ్ శాతం పెరిగి 48.49 శాతంగా (లక్షా 94 వేల 631 ఓట్లు) నమోదయ్యాయి.
