Chowkidar: డైలాగ్ కింగ్ సాయి కుమార్ (Dialogue King Sai Kumar) లక్కీ యాక్టర్‌గా మారిపోయారు. ఆయన ప్రస్తుతం ఏ చిత్రంలో నటిస్తే ఆ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంటుంది. గతేడాది ఆయన నటించిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన విషయం తెలిసిందే. ‘కమిటీ కుర్రోళ్లు, లక్కీ భాస్కర్, సరిపోదా శనివారం, మెర్సీ కిల్లింగ్’ వంటి ఆయన నటించిన చిత్రాలకు గద్దర్ అవార్డులు (Gaddar Awards) కూడా వచ్చాయి. అలాంటి లక్కీ యాక్టర్ సాయి కుమార్ తెలుగు, కన్నడ భాషల్లో నటిస్తున్న చిత్రం ‘చౌకీదార్’. పృథ్వీ అంబర్, ధన్యా రమ్యకుమార్ జంటగా నటిస్తున్న ఈ సినిమా నుంచి నాన్నపై ఓ అద్భుతమైన గీతాన్ని రెడీ చేశారు. తాజాగా ఆ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
Also Read- Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్రుడు.. కమెడియన్ అలీపై బూతు మాట!
‘చౌకీదార్’ మూవీని వీఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డా. కల్లహల్లి చంద్ర శేఖర్ నిర్మిస్తుండగా, చంద్రశేఖర్ బండియప్ప తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి అభిప్రాయాన్ని ఏర్పడేలా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడొచ్చిన నాన్న పాట కూడా నాన్న గొప్పతనం చాటి చెప్పేలా, గుండెను పిండేసేలా చక్కని బాణీతో సంగీత దర్శకుడు సచిన్ బస్రూర్ స్వరపరిచారు. నాన్న అంటూ సాగే ఈ పాటకు సంతోష్ వెంకీ సాహిత్యం అందించగా, సీనియర్ సింగర్ విజయ్ ప్రకాష్ ఆలపించారు.
‘నాన్న అంటేనే మొదటి దైవం.. తను పోసిన ప్రాణమిది
నాన్న అనగానే వాలే నీ ముందు.. అలుపెరుగని ప్రాణమిది
మనకొరకే బ్రతికే ప్రాణం.. మన బాధ్యత ఒక్కటే ధ్యానం
తన కంటి కనుపాపై.. కాపాడునులే నాన్న
చౌకీదారు.. చౌకీదారు.. మనకై నిలిచాడు..’ అంటూ సాగిన ఈ పాట తండ్రి త్యాగాల్ని, మోసే బాధ్యతల్ని, బిడ్డల పట్ల చూపించే ప్రేమను చాటేలా పాటను రచించారు. ఇక లిరికల్ వీడియో చూస్తుంటే సాయి కుమార్ తండ్రిగా మరోసారి ప్రేక్షకుల్ని హృదయాలను దోచుకునేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. బాధ్యతాయుతమైన తండ్రి పాత్రలో సాయి కుమార్ చక్కగా అతికిపోయారు. పృథ్వీ అంబర్, సాయి కుమార్‌ల మధ్య మంచి ఎమోషనల్ సీన్స్ ఉన్నట్లుగా ఈ పాట తెలియజేస్తుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించనున్నామని ఈ సందర్భంగా మేకర్స్ తెలియజేశారు.
Also Read- Sreeleela: నిశ్చితార్థం కాదు.. విషయమేంటో చెప్పేసిన శ్రీలీల!
సాయి కుమార్ విషయానికి వస్తే.. నటుడిగా తిరుగులేని 50 ఏళ్ల సుదీర్ఘ ‘ప్రస్థానం’ ఆయనది. బాల నటుడిగా మొదలైన సాయి కుమార్ ఎన్నో పాత్రలలో నటించారు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా ఒక్కటేమిటి? అన్ని రకాల పాత్రలు పోషించి, సంపూర్ణ నటుడిగా ఆయన పేరొందారు. 50 ఏళ్ల సినీ ప్రస్థానం తర్వాత కూడా ఆయన నటుడిగా బిజీగానే ఉన్నారు. ప్రతి సినిమాలో ఆయన కోసం దర్శకుడు పాత్రలను క్రియేట్ చేస్తుండటం విశేషం. ఇప్పుడాయన చేస్తున్న ‘చౌకీదార్’ సినిమా కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుందని మేకర్స్ బావిస్తూ.. ఈ పాటను ఆయన సినీ ప్రస్థానానికి అంకితం ఇస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు