NTR viral video: అభిమానులు తమ ప్రేమతో సెటబ్రెటీలకు ఒక్కోసారి చిరాకు కూడా తెప్పిస్తుంటారు. వారి ప్రైవసీకి ఆటంకం కలిగే విధంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా ఎన్టీఆర్ విషయంలో ఇదే జరిగింది. ఎన్టీఆర్ ఒక ఈవెంట్ విషయమై ఫోన్ మాట్లాడుకుంటూ హోటలోకి వెళుతుండగా అభిమానులు అత్యుత్సాహం చూపించారు. ఆయన్ను వీడియో తీసే ప్రయత్నం చేశారు. దీనిని ఎన్టీఆర్ చూసి వారిపై సీరియస్ అయ్యారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైలర్ అవుతోంది. ఆ వీడియోలో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ లో కనిపించారు. దీనిని చూసిన ఎన్టీఆర్ అభిమానుల సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ అంత ఫిట్ గా, స్మార్ట్ గా ఉండటంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అయితే కొంత మంది మాత్రం అభిమానులపై మండిపడటం ఏంటని కామెంట్లు పెడుతున్నారు.
Read also-Mana Shankara Vara Prasad Garu: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ రన్ టైమ్ ఎంతంటే?
స్పెషల్ లుక్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాత్ నీల్ దర్శకత్వంలో వర్కింగ్ టైటిల్ డ్రాగన్ అనే సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా రామోజీ ఫిల్మి సిటీలో నైట్ షూట్లు జరుపుకుంటుందని సమాచారం. హుతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన వార్ 2 సినిమా ఆసించిన మేర ఆడలేదు. అంతకు ముందు కొరటాట శివ దర్శకత్వంలో వచ్చిన దేవర పార్ట్ 1 కూడా ఓకే అనిపించింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాపై ఎన్టీఆర్ ఆశలు అన్నీ పెట్టకున్నారు. ఆ సినిమా కోసమే ఈ స్పెషల్ లుక్ అని సమాచారం. ఏది ఏమైనా ఎన్టీఆర్ ను ఇలా చూడతటంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కానీ ఇలా ఫ్యాన్స్ పై విరుచుకు పడటంపై మాత్రం భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి. కొంత మంది దీనిని సమర్థిస్తుంటే.. కొందరు మాత్ర వారికి మాత్రం ప్రైవసీ ఉండదా అంటూ సమర్థిస్తున్నారు.
Read also-Akhil Akkineni: అఖిల్ అక్కినేని గురించి ప్రొడ్యూసర్ చెప్పింది వింటే గూస్‌బంప్స్ రావాల్సిందే..
Instagram lo next mentalodu antunaaru 😂🤣🤣 pic.twitter.com/dq2JYeq4eR
— Allu Babloo AADHF (@allubabloo) January 5, 2026

