Akhil Akkineni: టాలీవుడ్ ఇండస్ట్రలో చాలా మంది డబ్బు కోసమో, ఫేమ్ కోసమో సినిమా లు చేస్తుంటారు. సినిమానే ఫ్యాషన్ గా కలిగిన, నటులు చాలా తక్కువ మంది ఉంటారు. అందుకు నిదర్శనం అఖిల్ అక్కినేని, అయ్య గారు తన మంచి మనసును మరో సారి చాటుకున్నారు. అనిల్ సుంకర నర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన అఖిల్ ఏజెంట్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత డిజాస్టర్ గా నిలిచిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన అనిల్ సుంకర తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఏజెంట్ సినిమా విషయంలో అఖిల్ వ్యవహరించిన తీరు మాట్లాడారు. ఆ సినిమా తర్వాత ఆయన పిలిచి మన ఒక చిన్న సినిమా చేద్దాం అన్నారని చెప్పుకొచ్చారు. అలా కాదని నిర్మాత పద్ద సినిమాలు పంపినా వద్దు సార్ మనం చిన్న సినిమానే చేద్దం అని అఖిల్ చెప్పిన దాన్ని చెబుతూ నిర్మాత ఎమోషనల్ అయ్యారు. దీనిని చూసిన నెటిజన్లు అఖిల్ అందుకే అయ్యగారు అయ్యారంటూ కామెంట్లు పెడుతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోెంది.
Read also-Jana Nayagan: విజయ్ ‘జన నాయకుడికి’ చివరినిమిషంలో కొర్రీలు పెడుతున్న సెన్సార్ బోర్డ్.. ఎందుకంటే?
అఖిల్ ‘లెనిన్’..
అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటిస్తున్న తాజా యాక్షన్ డ్రామా చిత్రం ‘లెనిన్’ (Lenin). అఖిల్ అక్కినేనికి జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు. వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిశోర్ అబ్బూరు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే తమన్ నుంచి ఓ పాట విడుదల చాట్ బాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
Read also-Megastar Movie: మెగాస్టార్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే?
లెనిన్ సాంగ్ ఎలా ఉందంటే?
ఇప్పటికే విడుదలైన సాంగ్ మ్యూజిక్ ప్రియుల మంచి టాక్ తెచ్చుకుంది. ఇక ఈ పాట మ్యూజిక్ లవర్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్‌ను రాబడుతోంది. ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా.. శ్వేతా మోహన్, జుబిన్ నౌటియాల్, థమన్ తమ వాయిస్‌తో పాటకు ఓ ఎమోషనల్ ఫీల్‌ను తీసుకొచ్చారు. మ్యూజికల్ సెన్సేషనల్ ఎస్.ఎస్. థమన్ సంగీతం సారథ్యంలో వచ్చిన ఈ పాట రొమాంటిక్ ఫీల్‌ను కలిగిస్తోంది. సినిమాలోని భావోద్వేగాలను తెలియజేస్తూ, లీడ్ పెయిర్ ఇద్దరి మధ్య కెమిస్ట్రీని హైలైట్ చేసేలా పాట ఉంది. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. ఈ పాట విడుదల సందర్భంగా అఖిల్ అక్కినేని ఇన్‌స్టా వేదికగా లిరిక్ రైటర్, సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్‌కు థ్యాంక్స్ చెప్పారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ను పూర్తి చేసుకుంటోన్న ఈ సినిమా ఇప్పటి వరకు 70 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుందని, మూవీని సమ్మర్‌లో రిలీజ్ చేస్తామని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ఈ సాంగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా నుంచి మరిన్ని వివరాల కోసం అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

